
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ‘అర్జున్ S/O వైజయంతి’ టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
అర్జున్ S/O వైజయంతి మూవీ ఎలా స్టార్ట్ అయింది?
-కళ్యాణ్ రామ్ గారితో ఒక సినిమా చేయాలనుకున్నాం. ఆయన ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ ఎక్కువగా చేస్తున్నారు. ఒక మాస్ కమర్షియల్ సినిమాని ఆయనతో చేయాలని ఈ కథని సిద్ధం చేయించాం. కథ ఆలోచన దగ్గర నుంచి ప్రతిదీ కళ్యాణ్ రామ్ గారి కోసం తయారుచేసినవే. మదర్ క్యారెక్టర్ ను విజయశాంతి గారు చేయాలని ముందే ఫిక్స్ అయ్యాం. అన్ని ప్లాన్ చేసుకుని చేసిన సినిమా ఇది. మంచి ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్.
దర్శకుడిగా ప్రదీప్ గారిని ఎంపిక చేసుకోడనికి కారణం?
-ప్రదీప్ గారితో నేనొక వెబ్ ఫిల్మ్ చేశాను. ఆయనతో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అయినా కమర్షియల్ మీటర్ తెలిసిన డైరెక్టర్. ఈ కథకు ఆయన బెటర్ అనిపించింది. హై ఎమోషన్ వున్న ఈ సినిమాని ఆయన అద్భుతంగా తీశారు.
అశోక్ గారు మీరు అలా ఎలా సినిమా చేసి పదేళ్లు అవుతుంది. మళ్లీ ఈ సినిమా చేయడం ఎలా అనిపించింది?
-అలా ఎలా సినిమా నా ఫ్రెండ్ అనీస్ కోసం చేశాను. అందులో సునీల్ కూడా ఉన్నారు. ఆ సినిమాని సునీల్ నే ప్రమోట్ చేశారు. కళ్యాణ్ గారు నా ఫ్రెండ్. అందరం కలసి ఒక సినిమా చేద్దామని ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది.
సినిమాకి చాలా బడ్జెట్ అయ్యిందని విన్నాం.. కొత్త దర్శకుడితో ఇంత స్కేల్ లో చేయడం రిస్క్ అనిపించలేదా?
-కళ్యాణ్ రామ్ గారితో ఒక మంచి మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమా చేయాలని అనిపించింది. దానికి తగ్గట్టుగా ఎక్కడా కాంప్రమైస్ కాకుండా ఈ సినిమాను నిర్మించాం. ముందు మేము ఈ కథని నమ్మాం. కథకు కావాల్సినది ఖర్చు చేశాం. ఖర్చు చేసిన ప్రతి రూపాయి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది.
ఫైనల్ అవుట్ ఫుట్ చూసుకున్నాక మీ అంచనాలు అందుకున్నట్లు అనిపించిందా?
-కచ్చితంగా. మేము అనుకున్న దాని కంటే సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.
విజయశాంతి గారి పాత్ర గురించి?
-లేడీ పోలీస్ ఆఫీసర్ అనగానే విజయశాంతి గారే గుర్తుకు వస్తారు. కర్తవ్యం సినిమా స్ఫూర్తితో తీర్చిదిద్దిన పాత్రలో కనిపిస్తారు. ఈ కథని ఆమె ఓకే చేస్తారని మాకు గట్టి నమ్మకం. మా నమ్మకం ప్రకారం ఈ సినిమాని ఆమె ఒప్పుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇందులో చాలా పవర్ ఫుల్ రోల్ చేశారు.
సోహెల్ ఖాన్ క్యారెక్టర్ గురించి ?
-ఈ సినిమా నటీనటుల విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. ఏదైనా సినిమాలో కొత్తగా అనిపించాలంటే పాత్రలకు ఎంచుకునే కాస్టింగ్ కొత్తగా ఉండాలి. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కి సోహెల్ ఖాన్ ని తీసుకోవాలని ఆలోచన డైరెక్టర్ గారిది. తను అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.
ఎన్టీఆర్ సినిమా చూసి మీతో ఏం షేర్ చేసుకున్నారు ?
-సినిమా ఫస్ట్ చూసింది ఎన్టీఆర్ గారే. ఆయన చూసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఎమోషనల్ యాక్షన్ బెస్ట్ ఉందని చెప్పాను. రికార్డింగ్ దగ్గర కాంప్రమైజ్ కాకుండా చూకోమని చెప్పారు. అజీనిష్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ గారు చెప్పినట్లు చివరి ఇరవై నిముషాలు కళ్ళు చెమ్మగిల్లెలా వుంటుంది. ఇలా రావడానికి కారణం సినిమా బిగినింగ్ నుంచి బిల్డ్ చేసిన ఎమోషన్. ఎన్టీఆర్ గారు చెప్పినట్టు సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది.

కథ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
-ఈ సినిమా కథ చాలా అద్భుతంగా కుదిరింది. కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారి క్యారెక్టర్స్ పోటాపోటీగా ఉంటాయి. పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఈక్వెల్ గా వుండే క్యారెక్టర్స్.
సినిమాలో ఎమోషనల్ అద్భుతంగా వుంటుంది. సెకండ్ హాఫ్ ఆడియన్స్ ఫోన్ బయటికి తీయరు. అంతా ఎంగేజింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఎక్సయిట్మెంట్ వుంటుంది. ప్రతి యాక్షన్ సీన్ కథలో భాగంగానే వస్తుంది. ఇలాంటి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి.
-కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారు చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ వలన సినిమా ఇంత గొప్పగా వచ్చింది. మేము అనుకున్న ఎమోషన్ ని చాలా నిజాయితీగా చెప్పాము.
-ఈ సినిమాని, కథని ఒప్పుకోవడం కళ్యాణ్ రామ్ గారి గొప్పతనం. మదర్ క్యారెక్టర్ కి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మామూలుగా జరగదు. కళ్యాణ్ గారి గొప్ప మనసుతోనే ఇలాంటి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమాకి అన్ని వైపులు నుంచి అద్భుతమైన బజ్ వుంది
ఇందులో మీకు బెస్ట్ అనిపించిన ఎపిసోడ్ ఏమిటి?
-ఇందులో మూడు ఎపిసోడ్లు ది బెస్ట్ అనిపించాయి. ఈ మూడు ఎపిసోడ్లు కూడా సెకండ్ హాఫ్ లో వస్తాయి. మూడు కూడా దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి.
మీరు ఇద్దరు ప్రొడ్యూస్ చేశారు కదా.,. మీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రాలేదా?
-మేము ఎప్పటినుంచో ఫ్రెండ్స్. మా ఇద్దరికీ ఒక మంచి వేవ్ లెంత్ వుంది. అందుకే కలిసి వర్క్ చేయగలుగుతున్నాం,.
సునీల్ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి?
-మూడు సినిమాలు ఉన్నాయండి. జగుతున్నాయి ?
అశోక్ గారు నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు?
-ఈసారి నా నుంచి రెగ్యులర్ గా సినిమాలు వస్తాయి. నాకు పర్సనల్ గా థ్రిల్లర్స్ ఇష్టం.