
వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ మూవీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ డ్రామా సబ్జెక్ట్ తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని సమాచారం. కాగా అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అట్లీ ప్రాజెక్ట్ వల్ల ఈ సినిమా ఆగిపోయింది. అట్లీ-బన్నీ మూవీ పూర్తయ్యేందుకు దాదాపు ఏడాదికిపైగా పడుతుంది. ఈ గ్యాప్లో వెంకీతో త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేసే ఛాన్సుంది.