మీడియా సమావేశంలో ఆశ్చర్య పరిచే విషయాలు బయట పెట్టిన నాని

నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ హిట్: ది 3rd కేస్‌లో మోస్ట్ ఇంటెన్స్ అండ్ వైలెంట్ అవతార్ లో కనిపించనున్నారు. ఈ సినిమా గ్లింప్స్, టీజర్, పాటలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌ ట్రెమండస్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించారు. HIT: ది 3rd కేస్ మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు వైజాగ్ సంగమ్ థియేటర్ లో భారీగా తరలివచ్చిన అభిమానులు సమక్షంలో లాంచ్ చేశారు. అనంతరం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. పొద్దున్న వైజాగ్ లో  ట్రైలర్ లాంచ్ చేసాం. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి నా ఫోన్  మెసేజ్ లతో  ఫుల్ అయింది. ట్రైలర్ కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ ఇది. చాలా ఆనందాన్నిచ్చింది. గత కొన్ని రోజులుగా మా టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. ఈ మధ్యకాలంలో లాస్ట్ మినిట్ లో ట్రైలర్స్ ఇస్తున్నారు. ఇంతకుముందు 20 రోజులు ముందు ట్రైలర్ వచ్చేది. ఆ నోస్టాల్జిజియా ఫీలింగ్ మళ్లీ ఇద్దామని ట్రైలర్ ని ముందుగానే రిలీజ్ చేసాము. ట్రైలర్ కోసం టీం అంత డే అండ్ నైట్ పనిచేసింది. ఈరోజు ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ కారణం శైలేష్ అండ్ టీం. వారందరికీ థాంక్యూ’అన్నారు.

డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. మీడియా ఫ్రెండ్స్ అందరికీ థాంక్యూ. ట్రైలర్ చూశారు. యూనిక్ గా క్రియేట్ చేసాము. నాతో కలిసి ఈ సినిమా చేసిన నా టీమ్ అందరికీ థాంక్యూ సో మచ్’ అన్నారు.

డిఓపి సాను జాన్ వర్గీస్ మాట్లాడుతూ.. తెలుగులో నాలుగు సినిమాలు చేశాను. ఈ నాలుగు సినిమాలు కూడా నాని గారితోనే వర్క్ చేశాను. ఈ సినిమా కూడా అలరిస్తుంది. ఇందులో నాని గారు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఈ సినిమా చాలా మంచి ఎక్స్పీరియన్స్’అన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర మాట్లాడుతూ.. నాని గారితో ఇది నా ఫస్ట్ మూవీ. నా కెరీర్ కి చాలా బెస్ట్ మూవీ అవుతుందని నమ్మకం ఉంది. టెక్నికల్ గా చాలా డీటెయిల్ తో చేసిన సినిమా ఇది. సినిమా కోసం డే అండ్ నైట్ వర్క్ చేసాము. బిగ్ స్క్రీన్ మీద మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఫ్యాషన్ తో పని చేసాము. మే ఒకటి సినిమా రిలీజ్ కాబోతుంది. అందరూ థియేటర్స్ లో చూస్తారని కోరుకుంటున్నా’అన్నారు.

అనంతరం క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు మూవీ టీం సమాధానాలు ఇచ్చారు.    

నాని గారు ట్రైలర్ ని ఇంత ముందుగా  రిలీజ్ చేయడానికి కారణం సినిమా గురించి ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడమా?
-టీజర్ తోనే ఆడియన్స్ సినిమా ఎలా వుంటుందో ప్రిపేర్ అయ్యారు. ట్రైలర్ ఇంత ముందుగా రిలీజ్ చేయడానికి కారణం.. ఇంకాస్త ఎక్సయిటమెంట్ పెంచడం,  అలాగే ఇది ఎంత స్ట్రాంగ్ కంటెంట్ వున్న ఫిల్మ్ అని చెప్పడం. గ్రేట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది.

-ఎమోషన్ స్ట్రాంగ్ వున్నప్పుడు వైలెన్స్ పండుతుంది. ఈ సినిమాలో వైలెన్స్ చూస్తున్నప్పుడు పూనకం వస్తుంది. దానికి కారణం ఆ సీన్స్ లో వుండే ఎమోషన్. యాక్షన్ డిజైన్ సరికొత్తగా వుంటుంది.

నాని గారు ఇంత వైలెన్స్ వున్న సినిమాలో చాగంటి గారి ప్రవచనం వాడటానికి కారణం?

-కథలో చాలా ముఖ్యమైన కనెక్షన్ వుంది. శైలేష్ ఈ కథ ఐడియా చాగంటి గారికి చెప్పారు. ఆయనకి చాలా నచ్చింది. చాగంటి గారు సినిమా కోసం ప్రత్యేకంగా చెప్పారు.

శైలేష్ గారు ఈసారి యాక్షన్ కోసం ఎలాంటి వర్క్ చేశారు?
-ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీకి చాలా ప్రాధాన్యత వుంటుంది. లీ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. స్క్రీన్ పై చాలా కొత్తగా వుంటుంది. ఇది చాలా డిఫరెంట్ జోనర్ మూవీ.

నాని గారు ఇంత వైలెన్స్ సినిమా  ఆడియన్స్ పై ఎలాంటి ఇంపాక్ట్ వుంటుంది?
-మనకంటే పదింతలు వైలెన్స్ సినిమాలు తీసే దేశాల్లో మన కంటే క్రైమ్ రేట్ తక్కువగా వుంది. మన బుద్ధి సరిగ్గా వుండాలి. సినిమా అనేది బాధ్యత. మేము ఎంత బాధ్యతగా తీశామో సినిమా చూస్తే మీకే అర్ధమౌతుంది.

కోర్ట్ సినిమా నచ్చకపొతే హిట్ 3 చూడొద్దు అన్నారు కదా.. మరి హిట్ 3 గురించి ఏం చెబుతారు?
-హిట్ 3 కి నేను నిర్మాతని కాబట్టి అలా చెప్పగలిగాను. (నవ్వుతూ)  అయితే హిట్ 3 లాంటి రెసీ థ్రిల్లర్, ఇలాంటి యాక్షన్ సినిమాలని ఎంజాయ్ చేసే ఆడియన్స్ కి  మే 1కి ఫుల్ మీల్స్. ఒక కొత్త థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. నేను చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తే నెక్స్ట్ టైం నానిని నమ్మకండి(నవ్వుతూ)

నాని గారు ఈ సినిమాలో మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏమిటి?
-ఈ కథ విన్తున్నప్పుడే కొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. శైలేష్ చాలా కొత్తగా సినిమాని డీల్ చేశాడు. నాకే చాలా విషయాలు కొత్తగా అనిపించాయి. ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టాం. అది మీరు స్క్రీన్ మీద చూస్తారు.

శైలేష్ గారు అర్జున్ క్యారెక్టర్ కి స్ఫూర్తి ఉందా ?
-ఇది లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్. దాన్ని ఫిక్షనల్ గానే క్రియేట్ చేశాం.

-ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా వుంది. ధర్మం కోసం నిలబడ్డ మనిషి ఎంత దూరం వెళ్ళాడనేది ఇందులో చూస్తారు. చాలా డిఫరెంట్ ఫిల్మ్.  చాలా యూనిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.