
రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నసినిమా “ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్”. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. “ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్” సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ మూవీ నుంచి ‘ఏదో ఏదో..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
‘ఏదో ఏదో..’ రిలికల్ సాంగ్ కు పూర్ణాచారి క్యాచీ లిరిక్స్ అందించగా, సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. కార్తీక్, హరిణి మంచి ఫీల్ తో పాడారు. ‘ఏదో ఏదో..’ సాంగ్ ఎలా ఉందో చూస్తే…’ఏదో ఏదో ఏదో జరిగెనే యెద లోపలా, ఏవో ఏవో కలలు విరిసెనే, నిన్నా మొన్నా లేదే అరే ఏంటిలా, ఉన్నట్టుండి ముంచేశావిలా, మనసే ముసుగులు తీసే, అడుగులు వేసే బయటకు నీతోనే, కలిసే నిమిషం వణికే, పెదవులు పలికే తకధిమి తందానే…’ అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.
నటీనటులు – రాహుల్ విజయ్, నేహా పాండే, అజయ్ ఘోష్, మురళీధర్ గౌడ్, గెటప్ శ్రీను, రచ్చ రవి, రవివర్మ, గంగవ్వ, జయశ్రీ, తదితరులు
టెక్నికల్ టీమ్
కో డైరెక్టర్ – ఉమేష్ నాగప్పగారి
కాస్ట్యూమ్స్ – స్ఫూర్తి రావు
ఆర్ట్ డైరెక్టర్ – మోహన్ జి
కొరియోగ్రఫీ – ఈశ్వర్ పెంటి
ఎడిటర్ – ఉదయ్ కుమార్ డి
క్రియేటివ్ హెడ్ – బాబ్ సునీల్
డీవోపీ – కార్తీక్ కొప్పెర
మ్యూజిక్ డైరెక్టర్ – సురేష్ బొబ్బిలి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్ – అర్జున్ దాస్యన్
డైరెక్టర్ – అశోక్ రెడ్డి కడదూరి