తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా గారు

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ లో చదువుతున్న స్కూల్లో ప్రమాదంలో గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. కాగా శనివారం రాత్రి పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్గ శంకరు ఇంకా తన భార్య అన్నా లెజినోవా గారితో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చారు. అయితే ఆదివారం సాయంత్రం అన్నా లెజినోవా గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లారు. తాను క్రిస్టియన్ కావడంతో దేవాలయ సిబ్బంది మధ్య ఫారంలో సంతకం పెట్టి గుడికి వెళ్లడం జరిగింది. ప్రతిరోజు ఆమె తన తలనీలాలను స్వామివారికి సమర్పించారు. సోమవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.