అంగరంగ వైభవంగా ‘అర్జున్ S/O వైజయంతి’ ప్రీరిలీజ్ & ట్రైలర్ లాంచ్ ఈవెంట్

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ‘అర్జున్ S/O వైజయంతి’ టీజర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మ్యాసీవ్ ప్రీరిలీజ్ & ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. మ్యాన్ అఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఇక్కడికి విచ్చేసిన అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు, అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా బృందానికి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ వేదిక పైన నేను అన్న నిలుచున్నప్పుడు నాన్నగారు చాలా సార్లు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈరోజు నాన్నగారు లేని లోటు తీరినట్లు అయింది విజయశాంతి గారు మాట్లాడుతుంటే. ఈవెంట్ లో నాన్నగారు ఉంటే ఎలా ఉండేదో విజయశాంతి గారు మాట్లాడుతూ ఉంటే ఆ లోటు నాకు భర్తీ అయిపోయింది. చాలామంది గొప్ప సినిమాలు చేసి అద్భుతంగా అలరించారు. కానీ విజయశాంతి గారు సాధించినటువంటి గొప్పతనం ఏ మహిళ సాధించలేదు, కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు ఇలా ఎన్నో వైవిధ్యమైనటువంటి పాత్రలు చేశారు. నాకు తెలిసి భారత దేశంలో ఏ నటి విజయశాంతి గారి లాంటి వైవిధ్యమైనటువంటి పాత్రలు చేయలేదు. ఆ ఘనత ఆవిడ ఒక్కరికే దక్కింది. భారతదేశ చలనచిత్ర పటంలో హీరోలకి సమానంగా నిలుచున్న ఏకైక మహిళ విజయశాంతి గారే. ఈ చిత్రం ఆలోచన కూడా కర్తవ్యంలో ఉన్న పాత్రకు ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుందో అనే ఆలోచన నుంచే మొదలయింటుందని భావిస్తున్నాను. ఈ వేడుకకు రావడం అభిమానులందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా నేను చూశాను. విజయశాంతి గారు లేకపోతే ఈ సినిమా లేదు. పృథ్వి గారు లేకపోతే,  సోహెల్ లేకపోతే ఈ సినిమా లేదు. ప్రదీప్ చిలుకూరి డైరెక్టర్ కాకపోతే ఈ సినిమా లేదు. సునీల్ గారు అశోక్ గారు ప్రొడ్యూసర్స్ లేకపోతే ఈ సినిమా లేదు. ఒక్కొక్కళ్ళు ప్రాణం పెట్టి ఈ సినిమాకు పని చేశారు. సినిమా చుసిన నాకు తెలుసు ఈ సినిమాని వాళ్ళు ఎంత నమ్మారో. 18 తారీఖున మీ అందరి ముందుకు రాబోతుంది ఈ సినిమా.  రాసి పెట్టుకోండి. ఆఖరి 20 నిమిషాలు థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంత అద్భుతంగా మలిచారు. ప్రతిసారి కాలర్ ఎగరేయమని నేను చెప్తుంటాను. ఈసారి కళ్యాణ్ అన్న కాలర్ని నేను ఎగరేస్తున్నాను. కళ్ళ నుంచి నీళ్లు ఆపుకోవడం నావల్ల కాలేదు. రేపొద్దున్న మీ అందరికీ అర్థమవుతుంది. ఆ ఆఖరి 20 నిమిషాలు అలా రావడానికి కారణం కళ్యాణ్ అన్న మాత్రమే. ఆయన ఆ ఆలోచనని నమ్మక పోయి ఉంటే. ఒక ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్ చేసే వాడిని కాదు. ఆయన నమ్మి డెడికేటెడ్ గా వర్క్ చేశారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కళ్యాణ్ అన్న కెరీర్ లో ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. విజయశాంతి గారిని అమ్మ అని నమ్మేసి చేశారు. తల్లిగా నమ్మేశారు కాబట్టే అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో సాంకేతిక నిపుణులకు నటీనటులందరికీ నా అభినందనలు. 18 తారీఖున అందరికీ బ్రహ్మాండమైన సినిమా రాబోతుంది .అభిమానులు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఏప్రిల్ 18న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా రిలీజ్ కాబోతుంది. ఆగస్టు 14న వార్ 2 సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది. ఇక్కడికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తుంటారు. ప్రతి అభిమాని నాకు చాలా ముఖ్యం. నాన్నగారు ఈ వేదిక మీద ఉన్నప్పుడు ఈ జన్మ అభిమానులకి అంకితం అని చెప్పాను. ఈ జన్మ ఈ జీవితం మీకే అంకితం. త్వరలోనే మళ్లీ మీ అందరినీ కలుసుకుంటాను. కొంచెం ఓర్పు సహనంతో ఉండండి. నందమూరి అభిమానులు అంటే ఓర్పు సహనానికి మారుపేరు. త్వరలోనే కలుసుకుందాం. సరదాగా మాట్లాడుకుందాం. అందరూ ఏప్రిల్ 18 వ తారీఖున థియేటర్స్ లో కలుసుకుందాం. అర్జున్ సన్ అఫ్ వైజయంతి  చిత్రాన్ని భారీ విజయం దిశగా తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను. జై ఎన్టీఆర్ జోహార్ హరికృష్ణ. అందరికీ ధన్యవాదాలు’అన్నారు.

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్ కి విచ్చేసిన మా సినిమా నటీనటులకు టెక్నీషియన్స్ కి, మీడియా ద్వారా చూస్తున్న తెలుగు రాష్ట్ర ప్రజలకు, ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాకి మూడు ఈవెంట్లు చేశాం. ఆ ఈవెంట్స్ లో మాట్లాడాను. ఈరోజు నేను మాట్లాడటం కన్నా సక్సెస్ మీట్ లో మాట్లాడాలని అనుకుంటున్నాను .ఏప్రిల్ 18 సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ లో మాట్లాడుతాను. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం చాలా సినిమాలు చూస్తాం. థియేటర్ నుంచి బయటికి వెళ్ళగానే మర్చిపోతాం. కానీ కొన్ని సినిమాలే ఇంటికి వెళ్లక కూడా మనసుని హత్తుకు హత్తుకునే ఉంటాయి. అలాంటి సినిమా మా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. చాలా రోజులు గుర్తు పెట్టుకుంటారు ఇది గ్యారెంటీ ఇస్తున్నాను. మీరంతా తమ్ముడు మాటల కోసం ఎదురుచూస్తున్నారు. తమ్ముడు మాట్లాడుతాడు. జోహార్ ఎన్టీఆర్.. జోహార్ హరికృష్ణ.. జైహింద్’అన్నారు.

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మాట్లాడుతూ..  మీ ఆనందం చూస్తుంటే మాకు ఉత్సాహం వస్తోంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. ఈ సినిమాలో తల్లి కొడుకు పాత్రల మధ్య జరిగే యుద్ధం రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా సంవత్సరాల నుంచి ఒక మంచి సినిమా చేయమని నా అభిమానులు అడుగుతున్నారు. సరిలేరు నీకెవరు చేశాను కానీ ఇంకా మంచి పాత్ర చేయమని అడిగారు. అలాంటి మంచి పాత్ర ఎలా వస్తుంది అని భావిస్తున్న తరుణంలో డైరెక్టర్ ప్రదీప్ గారు వచ్చి ఈ కథ చెప్పారు. చాలా మంచి కథ. అక్కడక్కడ కొన్ని మార్పులు చెప్పాను. డైరెక్టర్ గారు విన్నారు.కళ్యాణ్ రామ్ గారితో వెళ్లి నేను ఈ సినిమా చేస్తానని చెప్పారు. అలా ఈ సినిమా జర్నీ మొదలైంది. ఈ సినిమా కోసం చాలా నిజాయితీగా పని చేసాం. ప్రతిరోజు ఒక్కొక్క సీన్ చేస్తుంటే మాలో ఉత్సాహం నమ్మకం వచ్చింది. ఈ సినిమా డెఫినెట్ గా సూపర్ డూపర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమా అద్భుతంగా ఉందని ఫస్ట్ రిపోర్టు మాకు ఎడిటింగ్ టేబుల్ నుంచి తమ్మి రాజుగారు చెప్పారు. సెన్సార్ రిపోర్టు కూడా వచ్చింది .ఇద్దరం పోటాపోటీ పడి యాక్ట్ చేసామని చెప్పారు ఇంకో పెద్ద హిట్ కొట్టబోతున్నారని పేపర్ లో వచ్చింది. ఈ సినిమాకి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. కచ్చితంగా హిట్టు కొట్టబోతున్నామని ఫిక్స్ అయిపోయాం. తల్లి నిరంతరం తన బిడ్డ కోసం త్యాగం చేస్తూనే ఉంటుంది. ఆరాటపడుతూనే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో బిడ్డ రాంగ్ ట్రాక్ లోకి వెళ్తుంటాడు. అయినప్పటికీ తన బిడ్డ మంచి మార్గంలో మంచి మార్గంలోకి వస్తాడని సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క తల్లికి ప్రతి  ఒక్క మహిళకి ఈ సినిమాని మేము డెడికేట్ చేదల్చుకున్నాం. ఈ సినిమా క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు. రామారావు గారు మహానటుడు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అలాంటి రామారావు గారు ఎప్పుడూ మా మనసులో ఉంటారు. ఆయన నుంచి బ్లెస్సింగ్ తీసుకోవడం మా అదృష్టం. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇవాళ అభిమానులు గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన మంచి నటుడు, మంచి డాన్సర్ మంచి మనిషి. ఈరోజు ఓల్డ్ వైడ్ ఆయనకి అభిమానులు ఉన్నారు. ఎంతో కష్టపడి ఆయన ఆ స్థాయికి వెళ్లారు. అభిమానులు ఇచ్చే ఉత్సాహం మాలో 100 రెట్లు బలాన్ని ఇస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ గారిని చూస్తుంటే రామలక్ష్మణుల్లా ఉన్నారు. చూడ ముచ్చటగా ఉన్నారు మీరు ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరింత గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. కళ్యాణ్ రామ్ గారు సపోర్ట్ వల్ల ఈ సినిమాలో నేను ఇంకా అద్భుతంగా చేయగలిగాను. ఈ సినిమాల్లో పనిచేసిన అందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ అవుతుంది. తప్పకుండా సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను’అన్నారు

ప్రొడ్యూసర్ అశోక్ వర్ధన్ ముప్పా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నందమూరి అభిమానుల మధ్య నందమూరి అభిమానిగా మా అభిమాన హీరోల గురించి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈవెంట్ కి విచ్చేసిన మా తారక్ గారికి స్పెషల్ థాంక్స్. తారక్ గారు అభిమానుల కోసం ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. తన కష్టం ఎప్పుడూ సక్సెస్ అవ్వాలని,. ఆ సక్సెస్ తో అభిమానులు కాలర్ ఎత్తుకునే తిరగాలని కోరుకుంటున్నాను. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా కోసం కళ్యాణ్ రామ్ గారు రెండేళ్లు కష్టపడ్డారు. కళ్యాణ్ గారు విజయశాంతి గారి వల్లే ఈ సినిమా సాధ్యపడింది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ కి టెక్నీషియన్స్ కి పేరుపేరునా ధన్యవాదాలు. ఏప్రిల్ 18న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ ఈ సినిమాను చూసి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. సక్సెస్ మీట్ కి  మళ్ళీ తారక్ గారిని ఆహ్వానిద్దాం. అందరికీ థాంక్యు’అన్నారు

సోహెల్ ఖాన్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. మీ ప్రేమకి ధన్యవాదాలు. నేను ఎన్టీఆర్ గారి బృందావనం సినిమా చూశాను. అప్పట్నుంచి ఆయనకి అభిమానిగా మారిపోయాను. విజయశాంతి గారికి నేను పెద్ద అభిమానిని. ఆమె అందరికీ స్ఫూర్తి. నన్ను ఈ క్యారెక్టర్ లో బిలీవ్ చేసిన ప్రదీప్ గారికి థాంక్యూ. సినిమా బ్యూటిఫుల్ జర్నీ. తెలుగు పరిశ్రమ నాకు ఎంతగానో నచ్చింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కళ్యాణ్ గారు చాలా గొప్పగా సపోర్ట్ చేశారు. సినిమా డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుంది’అన్నారు

హీరోయిన్ సాయి మంజ్రేకర్ మాట్లాడుతూ. . అందరికీ నమస్కారం. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా యూనిట్ అందరికీ థాంక్యూ డైరెక్టర్ ప్రదీప్ గారు అద్భుతంగా ఈ సినిమాని తీశారు. చాలా గ్రేట్ విజన్ తో సినిమాని రూపొందించారు. విజయశాంతి గారు మా అందరికీ ఇన్స్పిరేషన్. సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’

యాక్టర్ పృథ్వి మాట్లాడుతూ. . ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు కళ్యాణ్ గారిని ఇది పాన్ ఇండియా రేంజ్ లో చేద్దాం అని చెప్పాను. అందుకు ఆయన నేను తెలుగు వాడిని తెలుగులోనే చేద్దాం అని అన్నారు. థాంక్యూ కళ్యాణ్ రామ్ గారు. మమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గారికి థాంక్యూ సో మచ్. ఆయన అందరికీ గొప్ప స్ఫూర్తి. విజయశాంతి అక్క థాంక్యూ. ఇది బ్యూటిఫుల్ సినిమా. అందరూ ఏప్రిల్ 18న వచ్చి సినిమా చూడండి. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది’అన్నారు.

డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ… నన్ను ఇన్స్పైర్ చేసిన స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. నందమూరి లెగిసిని కంటిన్యూ చేయడం ఒక బాధ్యత. అలాంటి బాధ్యతని నిర్వర్తిస్తున్న ఇద్దరు హీరోలు మా ముందు ఉన్నారు. సన్నాఫ్ వైజయంతిగా చాలా బాధ్యత గల పాత్రలో ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు కనిపించబోతున్నారు.  కళ్యాణ్ రామ్ గారు లేకపోతే నేను ఇక్కడ నిల్చోలేను. ప్రొడ్యూసర్స్ ఎక్కడ వెనకడుగు వేయకుండా ఈ సినిమాను తీశారు .ఈ కథని ఒప్పుకున్న విజయశాంతి గారికి థాంక్యూ విజయశాంతి. మేడమ్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్. అందుకే ఆమె లేడీస్ సూపర్ స్టార్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థాంక్యు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరికీ థాంక్యు’అన్నారు.

డిఓపి రాంప్రసాద్ మాట్లాడుతూ.. . కళ్యాణ్ రామ్ గారితో ఫస్ట్ పిక్చర్ అతనొక్కడే చేశాను. ఎన్టీఆర్ గారితో ఆది. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అఖండ 2 చేస్తున్నాను. ఈ సినిమా డైరెక్టర్ ప్రదీప్ గారికి థాంక్యూ. టెక్నీషియన్స్ యాక్టర్స్ అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు. అందరికీ థాంక్యూ సో మచ్’అన్నారు.

ఆర్ డైరెక్టర్ బ్రహ్మ కడలి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కళ్యాణ్ రామ్ గారితో మొదటిసారి వర్క్ చేయడం. ఆయన సినిమాని చాలా అద్భుతంగా ప్రేమిస్తారు అలాంటి నటులతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ ప్రదీప్ ప్రతి సీను చాలా అద్భుతంగా తీశాడు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.  మా నిర్మాతలు సినిమాని చాలా గొప్పగా నిర్మించి మీ ముందుకు తీసుకురాబోతున్నారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది’అన్నారు

రైటర్ శ్రీకాంత్ విస్సా మాట్లాడుతూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు. మాలో స్ఫూర్తిని నింపి మా మమ్మల్ని నడిపించిన కళ్యాణ్ రామ్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా కథ చెప్పగానే తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని మాకు నమ్మకం ఇచ్చిన విజయశాంతి గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్. ప్రదీప్ గారు అద్భుతంగా ఈ సినిమాను తీశారు. మా ప్రొడ్యూసర్స్ చాలా గ్రాండ్ గా సినిమాని నిర్మించారు. నందమూరి ఫాన్స్ కి థాంక్యూ. మళ్లీ సక్సెస్ మీట్ లో కలుద్దాం’అన్నారు. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.