మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం

ఇటీవల కాలంలో మంచు కుటుంబానికి సంబంధించిన ఎన్నో వివాదాలు బయటికి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మంచు మనోజ్ ఇంకా మంచు విష్ణు కి మధ్య ఎన్నో వివాదాలు కాగా అదే సమయంలో మంచు మోహన్ బాబు టీవీ రిపోర్టర్ పై ఆగ్రహంలో చేయి చేసుకోగా అది ఎంతో పెద్ద ఇష్యూగా మారింది. ఆ తర్వాత మోహన్ బాబు గారు రిపోర్టర్ ను కలిసి సారీ చెప్పారు. అదేవిధంగా మంచు మనోజ్ తన కుటుంబ ఆస్తి వివరాలకు సంబంధించి కొన్ని విషయాలు బయటపెట్టారు. అయితే పోలీసులు ఈ విషయాలలో కలగజేసుకుని కోర్టు వరకు పొగ కొంతవరకు ఈ వివాదాలు అనేవి సద్దుమనిగాయి చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మరోసారి ఈ కుటుంబానికి సంబంధించిన మరో వాగ్వాదం బయటకు వచ్చింది. తన అన్న మంచు విష్ణు తన కార్డును ఎత్తుకెళ్లారని మంచు మనోజ్ బాబుజల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటి ముందు గేటు వద్ద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మోహన్ బాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటుచేసి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఎప్పటికి చేసారు. తనకు ఎక్కడ ఇల్లు లేదని, అందుకే ఈ ఇంటికి వచ్చానని మంచు మనోజ్ వాపోయారు.