సుడిగాలి సుధీర్ పై హిందువులు ఆగ్రహం

జబర్దస్ ద్వారా బుల్లి తెరపై ప్రేక్షకుల చేరువైన సుడిగాలి సుధీర్ అంటే తెలియని వారు లేరు. అలాగే కొన్ని షోస్ ద్వారా మరింత చేరువయ్యారు. అలాగే మరోపక్క సినిమాలలో క్యారెక్టర్ ఇంకా ప్రధాన పాత్రలలో కనిపిస్తున్నారు. అయితే ఇటీవలే ఒక షోలో నందీశ్వరుని పై నుండి రంభ ను చూసి ఈశ్వరుడు కనిపించాలి కానీ అమ్మోరు కనిపిస్తుంది ఏంటి అనగా ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దేవుడుంపై పరాచకాలు ఏంటి అని హిందువులు నెట్ లో మండిపడుతూ కామెంట్ చేయగా ఇంత వరకు సుధీర్, లేదా ఆ షో నిర్వాహకులు ఎటువంటి రెస్పాండ్ కాలేదు.