టాలీవుడ్ డైరెక్టర్స్ చేతుల మీదగా విల్లాస్ ప్రారంభం

హైదరాబాద్, ఏప్రిల్ 4: తుక్కుగుడా ఓ ఆర్ అర్ సమీపంలోని లెమూర్ రోడ్‌ లో 20 ఎకరాల్లో బ్రిడ్జ్ ఎప్సిలాన్ విల్లాస్ గ్రీస్ వైభవం నుండి ప్రేరణ పొందిన ఆర్కిటెక్చరల్ మాస్టర్ పీస్ బ్రిడ్జ్ ఎప్సిలాన్ విల్లాస్ కు సంబంధించిన బ్రౌచర్ ను ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లోని అన్వయా కన్వెన్షన్ లో శుక్రవారం ముఖ్య అతిథులుగా పుష్పా దర్శకుడు సుకుమార్, జాతీయ అవార్డు గ్రహిత డైరెక్టర్ వంశీ పైడిపల్లి చేతుల మీద ఆవిష్కరించారు.

బ్రిడ్జ్ గ్రూప్ డైరెక్టర్ ఉజ్వాల్ రావు మాట్లాడుతూ.. “మేము గ్రీస్‌కు చెందిన‌ అసమానమైన అందం, చక్కదనాన్ని హైదరాబాద్‌కు తీసుకురావాలనుకున్నాము. బ్రిడ్జ్ ఎప్సిలాన్ విల్లాస్ యొక్క ప్రతి అంశం, దాని అద్భుతమైన ఎలివేషన్స్, హస్తకళా మాగ్నిఫికేషన్ ఈ ప్రాజెక్ట్‌ ప్రతిబింబిస్తుంది.
ప్రతి విల్లా మన్నిక, స్థిరత్వం, విలాసంగా ఉండేలా త‌గుజాగ్ర‌త్త‌లు నాణ్య‌మైన ముడిప‌దార్థాలు, వ‌స్తువుల‌ను నిర్మాణంలో వినియోగించిన‌ట్లు తెలిపారు. “మేము ఉత్తమమైన, అత్యాధునిక నిర్మాణ పద్ధతులను అనుస‌రించి పర్యావరణానికి అనుకూలంగా లగ్జరీ గృహాలను నిర్మిస్తున్న‌ట్లు వివ‌రించారు. బ్రిడ్జ్ ఎప్సిలాన్ విల్లాస్ మొదటి రకమైన పోడియం పార్కింగ్ భావనకు మార్గదర్శకత్వం వహిస్తుంది, ఇది గేటెడ్ క‌మ్యూనిటిలో పూర్తిగా ట్రాఫిక్ ర‌హిత‌ వాతావరణంలో ఏర్పాటు చేశామ‌న్నారు. 20 ఎకరాల్లో బ్రిడ్జ్ ఎప్సిలాన్ విల్లాస్ ఆహ్లదకరమైన వాతావరణంలో అధునాతన సౌకర్యాలతో అల్ట్రా-లగ్జరీ జీవితాన్ని గడిపేలా 4 & 5 బిహెచ్కె ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్ సుమారు లక్ష ముప్పైతోమ్మిది వేల చదరపు అడుగుల లో ఏర్పాటు చేసిన విల్లాస్ హైదరాబాద్ కి ఇది ఒక గేమ్ చేంజర్ గా అవుతుంది అని తెలిపారు.