“లవ్ యువర్ ఫాదర్” చిత్ర రివ్యూ

మనిషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ దీపా ఆర్ట్స్ బ్యానర్ పై నేడు విడుదలైన చిత్రం లవ్ యువర్ ఫాదర్. ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పి చరణ్ కీలకపాత్రలో శ్రీ హర్ష, కషిక కపూర్ జంటగా నటిస్తూ పవన్ కేతిరాజు దర్శకత్వంలో ఈ చిత్రం ముందుకు రావడం జరిగింది. ప్రవీణ్, రఘుబాబు, చత్రపతి శేఖర్, భద్రం, షకలక శంకర్, శాంతి కుమార్, బంటి తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలో పోషించారు. ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమా మణిశర్మ సంగీతాన్ని అందించారు. తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపే చిత్రంగా ఏప్రిల్ 4వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
తండ్రీ కొడుకుల మధ్య ఉండే ప్రేమానురాగాలను తెలిపే విధంగా ఈ చిత్రం తెరపైకి వచ్చింది. సమాజ సేవ చేస్తూ తన కొడుకును ఎంతో ప్రేమగా చూసుకుని వ్యక్తి ఎస్పీ చరణ్. ఇంజనీరింగ్ ఫైనల్ గా చదువుతూ తనతోనే చదువుతున్న కషికా కపూర్ తో ప్రేమలో ఉన్న యువకుడు శ్రీహర్ష. తన తండ్రి అంటే తనకి ఎంతో ఇష్టం. ఎంతో సజావుగా సాగుతున్న మీరు జీవితంలో బెట్టింగ్ వస్తుంది. అయితే ఆ బెట్టింగ్ వల్ల మీ జీవితాల్లో జరిగిన మార్పులు ఏంటి? మానవసేవే మాధవ సేవగా భావించే వీరికి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? అసలు వీడి జీవితంలో మార్పులు రావడానికి కారణం బెట్టింగ్ ఒకటేనా? శ్రీహర్ష ప్రేమ ఏం అవుతుంది? వారి జీవితంలో కాశీకి ఎంత వరకు ప్రాముఖ్యత ఉంది? చివరికి వారు చిక్కుకున్న చిక్కు నుండి బయట పడతారా? చివరికి ఏం జరుగుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన :
ఈ చిత్రంలో నటించిన వారి నటన విషయానికొస్తే ముందుగా ఎస్పి చరణ్ గారి గురించి మాట్లాడుకోవాలి. ప్రస్తుతానికి షోస్ లో యాక్టివ్గా ఉంటూ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆయన గతంలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇది ఆయనకు నటనపరంగా కంబ్యాక్ చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో హీరోకు తండ్రి పాత్రలో ఆయన ఎమోషన్స్ పరంగా అలాగే ఓ మంచి సామాజిక సేవ చేసే వ్యక్తిగా చెదరని మిత్రుడు వేసుకున్నారు. అదేవిధంగా చిత్రంలో హీరోగా నటించిన శ్రీహర్ష తన తొలిచిత్రమైనప్పటికీ ఎక్కడ కూడా కొత్త వ్యక్తి అనిపించేలా లేరు. తన నటనతో పూర్తిగా ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే చిత్రంలో హీరోయిన్ గా నటించిన కసిక కపూర్ మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. అదేవిధంగా హీరోకు స్నేహితులుగా నటించిన వారంతా మంచి నటనతో సినిమాకు ప్లస్ అయ్యారు. ప్రవీణ్, భద్రం, షకలక శంకర్, శాంతి కుమార్ మంచి కామెడీ టైమింగ్ తో బాగా ఎంటర్టైన్ చేశారు. అలాగే చత్రపతి శేఖర్ సినిమాలో కనిపించడం తక్కువ అయినప్పటికీ మంచి ఇంపాక్ట్ చూపించారు.

సాంకేతిక విశ్లేషణ :
తల్లి కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించడంలో దర్శకుడు పవన్ సక్సెస్ అయ్యారు అని చెప్పుకోవాలి. తను అనుకున్న కథను కచ్చితంగా పై చాలా అద్భుతంగా చూపించారు. ఈ చిత్రంలో పాటలు ఇంకా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికి బోనస్గా నిలిచాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ సీల్ ఇంకా వచ్చిన బీజీయంతో ప్రేక్షకులకు రోమాలు నుకపుడికి ఎలా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లోని స్పెషల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లొకేషన్స్ పరంగా వస్తే కాశి, మల్లారెడ్డి కాలేజీ, హైదరాబాదు అలాగే గోవాలో చాలా దాచాడుగా నిన్న జాగ్రత్తలు తీసుకుని చిత్రాన్ని రూపొందించినట్లు అవుతుంది. చిత్రంలోని కలరింగ్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలలో అద్భుతంగా ఉన్నాయి. క్వాలిటీ విషయానికొస్తే నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. రెండవ భాగంతో పోలిస్తే మొదటి భాగం కొంచెం స్లోగా ఉంది అనిపించినప్పటికీ రెండవ భాగంలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉండటంతో ప్రేక్షకులు చిత్రాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉంది. అలాగే చిత్రంలో నటించిన నటీనటుల అందరి కాస్ట్యూమ్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, నటీనటుల నటన, సంగీతం, కామెడీ, పాటలు

మైనస్ పాయింట్స్ :
మొదటి ఆఫ్ స్లోగా ఉండటం, హీరోయిన్ నటన

సారాంశం :
ఒక్క లైన్లో చెప్పాలంటే తండ్రి కొడుకులు మధ్య ఉండే అనుబంధాన్ని చూపించే ఒక మంచి కుటుంబం కథాచిత్రంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రం ఉంది.