ఏప్రిల్ 4 నుంచి జియోస్టార్‌లో స్ట్రీమింగ్‌ కానున్న ‘టచ్ మీ నాట్’

వైవిధ్య‌మైన కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ అత్యంత ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియో హాట్ స్టార్ నుంచి మ‌రో గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామాను అందించ‌నుంది.. అదే ‘టచ్ మీ నాట్’. న‌వ‌దీప్, దీక్షిత్ శెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ర‌మ‌ణ తేజ తెర‌కెక్కించిన ఈ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్ర‌ధాన పాత్ర‌ధారులు సీరియ‌స్ లుక్స్‌తో ఇన్‌టెన్స్ పాత్ర‌ల్లో న‌టించిన ఈ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది.  

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే ఈ సిరీస్ ఒక అత్యంత సున్నితమైన క్రైమ్ సంబంధిత విషయం చుట్టూ తిరుగుతుందని అర్థ‌మ‌వుతుంది. ట్రైలర్‌లో ధీక్షిత్ శెట్టి సైకోమెట్రిక్ సామర్థ్యాలు కలిగిన పాత్రలో క‌నిపిస్తున్నాడు. అతను పోలీసులకు సహాయం చేస్తూ, బాధితుల తలలను తాకడం ద్వారా హంతకులను కనుగొనడానికి తన సైకోమెట్రీని ఉపయోగిస్తున్నట్లు చూపించారు.  ఒక రహస్యం, అనేక ట్విస్ట్‌లతో సిరీస్‌ ముందుకు సాగుతుందని ట్రైల‌ర్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ రహస్యమైన క్రైమ్‌ను ఎవరు పరిష్కరిస్తారు? ఎవరు ఆ దెయ్యాన్ని వెంబడిస్తారు?

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌, ఆస‌క్తిక‌ర‌మైన క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ డ్రామాగా సిరీస్ రూపొందింద‌ని ట్రైల‌ర్ అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచింది.  నిజాన్ని బ‌యటపెట్టడానికి ప్రయత్నించే ఎవరైనా చావును ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌నేదే ఈ రహస్యమైన కేసు కథలో ప్రధాన భాగం. ఈ ఆసక్తికరమైన సిరీస్ టైటిల్ “టచ్ మీ నాట్ ఏంట‌నేది కూడా తెలుస్తుంది. కోమలీ ప్రసాద్, సంచిత పూనాంచ‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.  అశ్వత్థామ చిత్రాన్ని తెర‌కెక్కించిన ర‌మ‌ణ తేజ దీన్ని తెర‌కెక్కించారు.

ప్రతిభావంతులైన తారాగణం, ఆకర్షణీయమైన కథాంశం, నైపుణ్యం కలిగిన దర్శకుడితో, “టచ్ మీ నాట్ష అనే రోమాంచకరమైన క్రైమ్ డ్రామాను రూపొందించారు. ప్రేక్ష‌కుడికి ఆస‌క్తిని రేకెత్తించే అంశాల‌న్నీ ఇందులో ఉన్నాయి. ఈ సిరీస్‌ను సునీత తాటి గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు: న‌వ‌దీప్‌, దీక్షిత్ శెట్టి, బ‌బ్లూ పృథ్వీరాజ్‌, కోమ‌లి ప్ర‌సాద్‌, సంచిత పూనాంచ‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, దేవీ ప్ర‌సాద్‌, ప్ర‌మోదిని, రాజా ర‌వీంద్ర‌, శ‌శీధ‌ర్‌, శివారెడ్డి, ప్రదీప్ రెడ్డి, అనీష్ కురువిల్లా, క్రితి చుక్‌, తైలా, ఉమాదేవి, కొమిడి విశ్వేశ్వ‌ర్‌, క్రాంతి, సాన్విత‌, స‌మీర్‌, విహర్ష్‌, మ‌హీ రెడ్డి, అనీష్ రామ్‌, సుజాత‌, గీతా రెడ్డి, శ్రీనివాస్ భోగిరెడ్డి, స‌త్య ప్ర‌కాష్‌, దావూద్ దివ్య‌, చార్వి త‌దిత‌రులు.