
గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సంఖ్య నిన్నటితో 4500+కు చేరినట్లు ఆంధ్రా హాస్పిటల్స్ ప్రకటించింది. ఏపీలో మదర్స్ మిల్క్ బ్యాంక్తో పాటు బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాను అందించే కార్యక్రమాన్ని నమ్రతా ప్రారంభించారు. మహేశ్ బాబు ఫౌండేషన్ పిల్లల హార్ట్ ఆపరేషన్లను కొనసాగిస్తుందని ఆమె తెలిపారు.