సుశాంత్ #SA10 అనౌన్స్‌మెంట్ 

సుశాంత్ అనుమోలు తన ప్రాజెక్టులతో చాలా సెలెక్టివ్‌గా ఉన్నారు. తన మైల్ స్టోన్ 10వ మూవీ #SA10ని సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి పృథ్వీరాజ్ చిట్టేటి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. సంజీవని క్రియేషన్స్ బ్యానర్‌పై వరుణ్ కుమార్, రాజ్ కుమార్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా అనౌన్స్ మెంట్ ని స్ట్రైకింగ్ పోస్టర్ ద్వారా చేశారు. పోస్టర్ లో సుశాంత్ రెండు డిఫరెంట్ లుక్‌లలో ఆసక్తిని పెంచారు. పోస్టర్ పై భాగంలో అతను స్టైలిష్, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించారు. నేలపై పుర్రెలతో చుట్టుముట్టబడి, పిల్లి అతనిని చూడటం టెర్రిఫిక్ గా వుంది. 

దీనికి డిఫరెంట్ గా పోస్టర్ దిగువ బాగం వుంది. ఇది హీరో క్యారెక్టర్ మరో కోణాన్ని ప్రజెంట్ చేస్తోంది. ఇక్కడ సుశాంత్ ఎమోషనల్ గా గర్జిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది అతను పోషించే పాత్ర వెర్సటైల్ నేచర్ ని సూచిస్తుంది.

పోస్టర్ సూచించినట్లుగా, #SA10 సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్, దీనిలో సుశాంత్ ఎక్సర్సిస్ట్ పాత్రను పోషిస్తాన్నారు. ఇది తెలుగులో ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. ఈ పాత్ర కోసం సుశాంత్ మేకోవర్ పోస్టర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ చిత్రానికి అనిరుధ్ కృష్ణమూర్తి స్క్రీన్‌ప్లే రాయడంతో పాటు, దర్శకుడు పృథ్వీరాజ్ చిట్టేటితో కలిసి డైలాగ్స్ అందించారు. వైవిబి శివ సాగర్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఆశిష్ తేజ పులాల ఆర్ట్ డైరెక్టర్. సినిమా గురించి మరిన్ని ఆసక్తిరమైన వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

నటీనటులు: సుశాంత్ అనుమోలు

సాంకేతిక సిబ్బంది:

ప్రొడక్షన్ హౌస్: సంజీవని క్రియేషన్స్

నిర్మాతలు: వరుణ్ కుమార్ – రాజ్ కుమార్

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పృథ్వీరాజ్ చిట్టేటి

స్క్రీన్ ప్లే – డైలాగ్స్: అనిరుధ్ కృష్ణమూర్తి

డీవోపీ: YVB శివ సాగర్

ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పులాల

కాస్ట్యూమ్ డిజైనర్: సుమయ్య తబస్సుమ్

పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే.

మార్కెటింగ్: హాస్టాగ్ మీడియా.

పీఆర్వో: వంశీ-శేఖర్