‘కోర్ట్’ సెలబ్రేషన్ వెర్డిక్ట్ ఈవెంట్

నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రిమియర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో టీం సెలబ్రేషన్ అఫ్ ఆడియన్స్ వెర్డిక్ట్ ఈవెంట్ నిర్వహించింది.

సెలబ్రేషన్ అఫ్ ఆడియన్స్ వెర్డిక్ట్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను ఈ రోజుదాక స్క్రిప్ట్, ప్రేక్షకులు.. ఈ రెండు విషయాలనే నమ్మాను. స్క్రిప్ట్ మా టీంని గెలిచింది. తెలుగు ప్రేక్షకులు సినిమాని గెలిపించారు. కోర్ట్ సినిమా నన్ను గెలిపించింది. ఈ సినిమా విషయంలో, టీం విషయంలో చాలా ప్రౌడ్ గా ఫీలౌతున్నాను. ఈ వీకెండ్ ఒక పండగలా గడిచింది. రానున్న రోజుల్లో కోర్ట్ పేరు మారుమ్రోగుతుంది. సినిమాని ముందుకు తీసుకెలుతున్న అందరికీ పేరుపేరునా థాంక్ యూ. జగదీష్ ని చూసిన వెంటనే నమ్మకం కుదిరింది. నేను మొదటి చూసినప్పుడు ఎలా ఉన్నాడో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి కూడా అంతే సింపుల్ గా వున్నాడు. ఇది గ్రేట్ క్యాలిటీ. ఇప్పటి నుంచే అసలు జర్నీ వుంటుంది. దినేష్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఇచ్చాడు. ఈ కథలో విజువల్ చేసే మ్యాజిక్ ప్రతి ఫ్రేం లో కనిపిస్తుంది. ఆర్ట్ డైరెక్టర్ విట్టల్, ఎడిట్ కార్తిక్, మ్యూజిక్ విజయ్ అందరికీ థాంక్. విజయ్ మ్యూజిక్ ఈ సినిమాకి సూపర్ స్టార్. తన మ్యూజిక్ తో ఎమోషన్ తీసుకొచ్చాడు. నా ప్రొడక్షన్, వాల్ పోస్టర్ సినిమా టీం అందరికీ థాంక్ యూ. ప్రశాంతితో కలసి ఇలాంటి మంచి సినిమాలు చేయడం చాలా ఆనందంగా వుంది. దీప్తి అక్కకి ఈ సినిమాకి సంబధించి అన్ని అప్పగించాను. తను సినిమాని చాలా జాగ్రత్త చూసుకుంది. టీంకి ఒక అక్కలా అయిపొయింది. హర్ష గారు వెర్సటైల్ యాక్టర్. ఈ సినిమాలో పార్ట్ కావడం ఆనందంగా వుంది. రఘు ఈ సినిమాకి బలం. పూర్ణ చారి అమెజింగ్ లిరిక్స్ రాశారు. ప్రేమ పాట సగం ప్రమోషన్స్ చేసింది. రోషన్ శ్రీదేవి బ్యూటీఫుల్ గా పెర్ఫార్మ్ చేశారు. ప్రభావతి గారికి, సుధాకర్ గారికి నేను ఫ్యాన్ ని. రోహిణి గారు మా అమ్మ. ఆమెను చూస్తేనే బోలెడు పాజిటివిటీ వస్తుంది. శివాజీ గారు విజ్రుంభించి చేసిన సినిమాలో నేను పార్ట్ కావడం చాలా ఆనందంగా వుంది. దర్శి తెలుగు సినిమా నసీరుద్దిన్ షా. తనకంటూ ఒక స్టయిల్ వుంది. తనలో గొప్ప సెటిల్ నెస్ వుంటుంది. కంగ్రాట్స్ దర్శి. కోర్ట్ అనే బ్యూటీఫుల్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఈ సెలబ్రేషన్స్ త్రూ అవుట్ ది ఇయర్ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ’అన్నారు

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. బలగం హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్నపుడు రామ్ జగదీశ్ ఈ కథ చెప్పారు. ఈ కథ విని చాలా గొప్పగా ఫీలయ్యాను. మాకు సపోర్ట్ గా దీప్తి అక్క, ప్రశాంతి గారు వచ్చారు. మేమంతా రాకెట్ లో కూర్చుంటే మమ్మల్ని చుక్కల దాక తీసుకెళ్ళారు. ఆయన నమ్మకపోయుంటే ఇది ఇంత దూరం వచ్చేది కాదు. ఈ సినిమా, మంగపతి పాత్ర గురించి అందరూ చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. శివాజీ అన్న మాకు గొప్ప స్ఫూర్తి ఇచ్చారు. ఈ సినిమాలో నాతో పాటు నటించిన అందరికీ థాంక్ యూ. రోహిణీ గారు, శుభలేఖ సుధాకర్ గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. విజయ్ వరల్డ్ క్లాస్ సౌండ్ ఇచ్చారు. దినేష్ ఈ సినిమాకి వెలుగు తీసుకొచ్చారు. విట్టల్ తన కోర్ట్ సెట్ కి జీవం పోశారు. కార్తిక్ అద్భుతంగా ఎడిట్ చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. తెలుగు ప్రేక్షకులు జాతిరత్నాలు. థాంక్ యూ సో మచ్’అన్నారు.

యాక్టర్ శివాజీ మాట్లాడుతూ… 25 ఏళ్ళుగా మంగపతి లాంటి క్యారెక్టర్ కోసం ఎదురుచూశాను. ప్రతి ఆర్టిస్ట్ కి ఒక కల వుంటుంది. ఒక రోజు మొత్తం ఒక ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకోవాలని. అది ఈ సినిమాతో తీరింది. నాని గారు ఇండస్ట్రీకి మరో సూపర్ స్టార్ కృష్ణ. ఆయనలానే కొత్త తరహలో దమ్మున్న సినిమాలు చేస్తున్నారు. ఆయన వాల్ పోస్టర్ నుంచి ఎంతోమంది దర్శకులు. సినిమాలు చేయాలని కసి నాకూ వుంది. ఆ కసికి సాకారం నాని గారు రామ్ ఇచ్చారు. ఇకపై సినిమాలు చేస్తాను. ఈ సినిమా గొప్ప ఎక్స్ పీరియన్స్. ఈ సినిమాలో పని చేసిన అందరూ అద్భుతంగా చేశారు. మంగపతి లాంటి పాత్ర లైఫ్ లో ఒకేసారి వస్తుంది. ఆ కిక్ ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సినిమా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమా జిందాబాద్.. ప్రొడ్యూసర్ జిందాబాద్.’అన్నారు.  

డైరెక్టర్ రామ్ జగదీశ్ మాట్లాడుతూ.. సినిమా విషయంలో చాలా ప్రౌడ్ గా ఫీలౌతున్నాను. సినిమాకి చాలా పవర్ వుంది. సినిమా జీవితాన్ని మార్చగలదు. నాని గారి  ప్రోడక్ట్ అని చెప్పడం ప్రౌడ్ గా వుంది. ప్రియదర్శి అన్న థాంక్ యూ. మంగపతి క్యారెక్టర్ లో శివాజీగారిని తప్పితే మరొకరిని ఊహించలేదు. నటీనటులు, టెక్నికల్ టీం, మీడియా, ఇంత సక్సెస్ ఇచ్చిన తెలుగు ఆడియన్స్ అందరి విషయంలో చాలా ప్రౌడ్ గా ఫీలౌతున్నాను’అన్నారు

యాక్టర్ రోహిణి మాట్లాడుతూ.. సినిమా అన్ని చోట్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రామ్ జగదీశ్ అద్భుతమైన రైటింగ్ తో గొప్ప కథ చెప్పారు. మాస్టర్ స్క్రీన్ ప్లే రాశారు. సినిమా చూస్తున్నప్పుడు చాలా చోట్ల చప్పట్లు కొట్టారు. నాని గారు ట్రూ ట్యాలెంట్ ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారు. మంచి సినిమా ఇస్తే ఆడియన్స్ గొప్పగా సెలబ్రేట్ చేస్తారని చెప్పడానికి ఈ సినిమా మరో నిదర్శనంగా నిలిచింది’అన్నారు.

యాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ..కోర్ట్ సినిమా ఇంత అద్భుతంగా ఉండటానికి కారణం నాని గారి జడ్జ్మెంట్. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో పని చేసిన అందరికీ ఒక ప్రత్యేకమైన గౌరవం దక్కుతుంది. ఇది గొప్ప సంస్కారం. ఈ సక్సెస్ మీట్ లో అందరూ అందరికీ క్రిడెట్స్ ఇవ్వడం చాలా అనందంగా వుంది. నాని గారు ఇచ్చిన స్టేట్మెంట్ మామూలుది కాదు. అది ఆయన కాన్ఫిడెన్స్. ఆయన గ్రోత్ చుస్తూనే వున్నాను. ఆయన స్టార్ అవ్వడమే కాదు స్టార్ మేకర్ అయ్యారు. గట్స్ వుంటేనే ఇలాంటి సినిమాలు తీయగలం. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’అన్నారు    

యాక్టర్ శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ.. కోర్ట్ సినిమాకి ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు అద్భుతం. నాని గారు ఒక ప్రేక్షకుడిగా ఆలోచించి సినిమాని చేస్తారు. నాని గారు లాంటి వ్యక్తులు వుంటే ఇలాంటి అద్భుతాలు తెరపైకి వస్తాయి. ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా ఆనందంగ వుంది. ఇందులో శివాజీ గారి మంగపతి క్యారెక్టర్ కి హ్యాట్సప్. ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన అందరికీ ధన్యవాదాలు’అన్నారు.

నిర్మాత వెంకట్ బోయినపల్లి మాట్లాడుతూ.. అందరికీ థాంక్ యూ. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కంగ్రాట్స్. శివాజీ గారు నా ఫేవరేట్. ఇందులో ప్రేమలో పాట నాకు చాలా నచ్చింది. సిరివెన్నెల గారిని గుర్తుకు తెచ్చింది. ఈ పాట విన్నప్పుడే బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పాను. నాని గారు ఈ సినిమా విషయంలో ఇచ్చిన స్టేట్మెంట్ నాకు పెద్ద సర్ ప్రైజ్ అనిపించలేదు. ఎందుకంటే ఆయనపై నాకు నమ్మకం వుంది. శ్యామ్ సింగరాయ్ సినిమాకి కూడా ఇలానే చెప్పారు. ఆయన జడ్జ్మెమెంట్ పై నాకు నమ్మకం వుంది. నాని గారు ఎందరికో లైఫ్ ఇచ్చారు. నిర్మాతగా మాకు కూడా మంచి కాన్ఫిడెన్స్ ఇస్తారు. ఆయన దర్శకులని నిర్మాతలని పరిచయం చేస్తూ నాలుగు కాలాలు పాటు ఇలానే వుండాలని కోరుకుంతున్నాను’అన్నారు

యాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ.. నా సినిమాని ఆడియన్స్ తో కలిసి చూడటం ఓ డ్రీం. ఆడియన్స్ తో కలసి చూడటం గొప్ప అనుభూతి. నాని గారికి థాంక్ యూ. దీప్తి, ప్రశాంతి గారికి అందరికీ థాంక్. సినిమాని తప్పకుండా థియేటర్స్ లో చూడండి’అన్నారు.

యాక్టర్ రోషన్ మాట్లాడుతూ.. మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కి థాంక్. ఈ సక్సెస్ చాలా అనుభూతిని ఇచ్చింది. డైరెక్టర్ రామ్ అన్నకి థాంక్ యూ. దీప్తి అక్క ప్రశాంతి గారికి థాంక్. మంచి కంటెంట్ వున్న సినిమా తీస్తే ఆడియన్స్ లవ్ ఇస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది.నాని అన్న లవ్ యూ. ఇంత గొప్ప విజయం ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ’అన్నారు

నిర్మాత దీప్తి గంటా మాట్లాడుతూ.. డైరెక్టర్ జగదీశ్ సినిమా పిచ్చోడు. తను సినిమా గురించి తప్పా మరొకటి మాట్లడడు. వాల్ పోస్టర్ సినిమాతో తన జర్నీ మొదలుకావడం ఆనందంగా వుంది. ప్రియదర్శి పెర్ఫార్మెన్స్ బ్రిలియంట్. మంగపతి క్యారెక్టర్ లో శివాజీ గారిని షాక్ అయ్యాను. ఇది ఆయనకి గ్రేట్ కం బ్యాక్ కావడం ఆనందంగా వుంది. సురభి, రోహిణీ గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. రోషన్ శ్రీదేవి చాలా ప్యాషన్ తో నటించారు. వీరికి చాలా మంచి ఫ్యూచర్ వుంటుంది. విజయ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. దినేష్ గారి తన ఫ్రేమింగ్ తో సినిమాకి రిచ్ నెస్ తీసుకొచ్చారు. కార్తిక్ గారు సినిమాని పర్ఫెక్ట్ గా ఎడిట్ చేశారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. నానికి థాంక్ యూ చెప్పలేను. తను నాపై ఎంతో నమ్మకం ఉంచాడు. అలాగే ప్రశాంతి గారు కూడా. మేము అనుకున్నదాని కంటే సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా వుంది’అన్నారు.  

మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ… జగదీశ్ గారు అద్భుతమైన క్లారిటీ స్క్రిప్ట్ చెప్పారు, ఆయనతో జర్నీ మెమరబుల్. రెండు ట్యూన్స్ వెంటనే ఓకే చేశారు. దీప్తి ప్రశాంతి గారికి థాంక్ యూ. డైరెక్టర్ విజన్ తో మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. నాని గారు నాకు ఒక బ్రదర్ లా అనిపిస్తారు. నానికి గారికి ఎప్పటికీ రుణపడి వుంటాను’అన్నారు.  

యాక్టర్ సురభి ప్రభావతి మాట్లాడుతూ.. సినిమాకి ఎక్కడ చూసినా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. చేసింది మేమే అయినా సినిమా చూస్తున్నప్పుడు చాలాసార్లు ఏడుపు వచ్చేసింది. ఇంత మంచి సినిమా ఇచ్చిన వాల్ పోస్టర్ సినిమా కి థాంక్యూ సో మచ్. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’అన్నారు.

లిరిక్ రైటర్ పూర్ణాచారి మాట్లాడుతూ.. నాని గారు చెప్పారంటే అవుతుంది అందులో సందేహం లేదు. నాని గారు  బ్యానర్ లో రాయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఉండడం గౌరవంగా ఉంది. ఇందులో ప్రేమ పాట ఇచ్చిన ఎనర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పాటని రాయించుకున్న డైరెక్టర్ రామ్ జగదీష్ కి క్రెడిట్ దక్కుతుంది. రామ్ ప్రియదర్శి ఎప్పుడు కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తారు. దీప్తి గారు ప్రశాంతి గారికి థాంక్యూ సో మచ్. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’అన్నారు.

యాక్టర్ కమల్ మాట్లాడుతూ.. నాని గారి వలన నాకు నాలుగు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అవకాశం దక్కింది. నాని గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ సో మచ్’అన్నారు

యాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా సక్సెస్ లో నేను భాగం పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. వాల్ పోస్టర్ సినిమా అంటే ఒక బ్రాండ్. రామ్ జగదీష్ గారి టీం పర్ఫెక్ట్ టీం. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ క్రెడిట్ అంతా నాని గారికి దక్కుతుంది . ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యారు. అందరికీ కంగ్రాజులేషన్స్. ఈ ఒక్క సినిమా 100 సినిమాలు తీసి అంత దారి చూపించింది. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’అన్నారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.