
భారత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అంటే పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో గొప్ప చిత్రాలకు సంగీతం అందించిన ఆయన ఇటీవల చావా చిత్రానికి ఆయన సంగీతం అందించడం జరిగింది. అయితే చాతిలో నొప్పి కారణంగా ఆయనను చెన్నైలోని ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. ఆస్కార్ అవార్డుతో పాటు మరెన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న రెహమాన్ ను భారతదేశం గతంలోనే పద్మశ్రీ ఇంకా పద్మభూషణ్ బిరుదులతో సత్కరించింది. ఇటీవల రెహమాన్ తన భార్యతో విడిపోతూ విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.