
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన 12 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఆవిర్భావ సభ కావడంతో మార్చి 14వ తేదీన ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే ఈ సభలోనే భాషకు సంబంధించి అలాగే ప్రాంతీయ సంస్కృతిల గురించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. కాగా దీనిపై కొంతమంది అనుకూలంగా స్పందించగా మరి కొంతమంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ప్రతికూలంగా స్పందిస్తున్నారు. అయితే నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి సంబంధించి ఇప్పటిది అలాగే గతంలో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా చేసిన ఒక ట్వీట్ ను కలిపి పోస్ట్ చేస్తూ “ గెలవక ముందు “జనసేనాని”, గెలిచిన తరువాత “భజన సేనాని” … అంతేనా జస్ట్ ఆస్కింగ్ అనే హష్టాగ్ తో ట్వీట్ చేశారు. దానితో ఈ విషయం ఇంటర్నెట్లో మరింత వైరల్ గా మారింది. ఇటీవల కాలంలో కూడా తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు స్పందించగా ఆ స్పందన పై నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. గతంలో ఇటువంటివి కొన్ని రాజకీయ పరమైన వ్యాఖ్యానాలు నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తూ స్పందించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది.