
సప్తగిరి హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘పెళ్లి కాని ప్రసాద్’. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్ తో పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించారు. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది. దిల్ రాజు నేతృత్వంలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా మార్చి 21న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో హీరో సప్తగిరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘పెళ్లికాని ప్రసాద్’ సినిమా కోసం మాకు మేము ఒక ఎగ్జామ్ రాసుకున్నాం. నా మనస్సాక్షిగా 100% మంచి మార్కులు వేసుకున్నాను. ఈ సినిమాకి ఆడియన్స్ దగ్గర కూడా మంచి మార్కులు పడతాయని ఆశిస్తున్నాను. సినిమా చాలా బావొచ్చింది. మార్చి 21న మీరంతా సినిమా చూసి జెన్యూన్ గా రివ్యూ ఇస్తారని కోరుకుంటున్నాను. హీరోయిన్ గా నటించిన ప్రియాంక శర్మ గారికి థాంక్యూ. అన్నపూర్ణమ్మ గారు ప్రమోదిని గారు మిగతా నటులంతా ఈ సినిమాలో చేసే హడావిడి తప్పకుండా మీకు కడుపుబ్బా నవ్విస్తుంది. ఇందులో నా క్యారెక్టర్ మురళి గౌడ్ క్యారెక్టర్స్ లో ఒక సిన్సియారిటీ కనిపిస్తుంది. ఈ సినిమా మంచి ఫన్ బ్లాస్ట్ గా ఉంటుంది. నిర్మాతలు ఎక్కడ కూడా రాజీపడకుండా సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఆడియన్స్ అందరు కూడా గొప్పగా మాట్లాడే సినిమా తీశారు. మా సినిమా టీజర్ లాంచ్ చేసిన ప్రభాస్ అన్నకి థాంక్యూ సో మచ్. మా ట్రైలర్ ని విక్టరీ వెంకటేష్ గారి లాంచ్ చేశారు. ఒరిజినల్ పెళ్ళికాని ప్రసాదు వెంకటేష్ గారు కాబట్టి ఆయన నన్ను ఆశీర్వదించి సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకున్నారు. ఆయనకి ధన్యవాదాలు. ఎస్విసి లాంటి గొప్ప బ్యానర్ లో ఈ సినిమా రిలీజ్ కావడం మా అదృష్టం. మంచి కంటెంట్ ఉంటేనే వాళ్లు రిలీజ్ చేస్తారు. దిల్ రాజు గారి కి శిరీష్ గారికి థాంక్యూ వెరీ మచ్. వారి దగ్గరే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా యాక్టర్ గా ఎదిగాను. ఇంత లాంగ్ టైం తర్వాత వారి బ్యానర్లో సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా,ఎమోషనల్ గా ఉంది. నన్ను సపోర్ట్ చేసిన వారి బ్యానర్ కి, మారుతి గారికి, కి అనిల్ అన్నకి, అందరికీ మంచి పేరు తీసుకొచ్చే సినిమా చేశాను. ఈ సినిమా వెంట నిలబడ్డ అందరికీ థాంక్యూ సో మచ్. తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్ అందరిని మెప్పిస్తుందని నమ్ముతున్నాను’అన్నారు.
డైరెక్టర్ అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ….. మీడియా అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరికీ థాంక్యు. మా ప్రొడ్యూసర్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. ఆయనకి చాలా థాంక్యూ. అందరూ మార్చ్ 21 థియేటర్స్ కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను’అన్నారు.
ప్రొడ్యూసర్ కేవై బాబు మాట్లాడుతూ… ఈ సినిమా కథ, కామెడీ చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. మా టీజర్ రిలీజ్ చేసిన ప్రభాస్ గారికి, ట్రైలర్ రిలీజ్ చేసిన వెంకటేష్ గారికి, దిల్ రాజు శిరీష్ గారికి, మారుతి గారికి సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యు. మార్చి 21న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా వచ్చి చూడాలి’అని కోరారు

హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ.. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఆడియన్స్ కి ఒక ఐడియా వచ్చే ఉంటుంది. ఈ సినిమాని మేము నవ్వి నవ్వి షూట్ చేశాం. ఇది చాలా ఫన్ ఎక్స్పీరియన్స్. హీరో గారికి ,ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి థాంక్యూ. మార్చి 21న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ వచ్చి థియేటర్స్ కి వచ్చి మూవీ చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు’అన్నారు
యాక్టర్ అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ.. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా చాలా సరదాగా ఉంటుంది. కడుపుబ్బా నవ్వేలా ఉంటుంది. మార్చి 21న మేమంతా వస్తున్నాం. సినిమా ఎలా ఉందో మీరు చూసి చెప్పాలి. డైరెక్టర్ గారు చిన్న కుర్రాడైనాచాలా అద్భుతంగా సినిమా తీశారు. సినిమా చూస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. సినిమా చాలా హ్యూమరస్ గా ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా ఇది’అన్నారు.
యాక్టర్ ప్రమోదిని మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఈ సినిమా మార్చి 21న వస్తున్నాం అందర్నీ చాలా నవ్విస్తున్నాం నాకు ఇంట్లో ఈ సినిమా చాలా మంచి మైలేజ్ ఇస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో కామెడీ రోల్ ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ అభిలాష్ రెడ్డికి థాంక్యూ అన్నపూర్ణమ్మ గారితో కలిసి చేస్తున్న ఫస్ట్ సినిమా ఇది చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం సప్తగిరి గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది.’అన్నారు.