
నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పించిన మూవీ ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. హర్ష్ రోషన్, శ్రీదేవి అప్పల, శివాజీ, సాయికుమార్, హర్షవర్ధన్, రోహిణి, రాజశేఖర్, శుభలేఖ సుధాకర్, విషికా కీర్తి, సురభి ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజయ బుల్గానిన్ సంగీతం అందించగా దినేష్ పురుష్ డిఓపి గా పని చేశారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రానికి చిత్రంపై నమ్మకంతో రెండు రోజుల ముందుగానే పైడ్ ప్రీమియర్స్ వేయడం జరిగింది. ఇక ఈ చిత్రం రివ్యూ విషయానికి వస్తే…
కథ:
చందు(రోషన్), జాబిల్లి (శ్రీదేవి) ఇద్దరు ప్రేమించుకుంటారు. వాడి విషయం తెలిసిన జాబిల్లి మేనమామ మంగపతి (శివాజీ) చందు పై తన ఆర్థిక రాజకీయ బలగంతో తన మేనకోడలు మైనర్ అని, చందు పై పోక్సో కేసు పెడతాడు. అయితే ఈ కేసులోకి తేజ (ప్రియదర్శి) ఎలా వస్తాడు? అసలు సాయి కుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న తేజ నిజంగా లాయరా కాదా? చందు పై ఎటువంటి కేసులు ఫైల్ చేశారు? ఆ కేసులన్నీ నిజమైనవా లేక కల్పించినవా? వాటిలో ఎన్ని కేసులు నిలబడ్డాయి? చందుకు శిక్ష పడిందా లేదా? మంగపతి తన మేనకోడలు కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నాడు? చివరికి ఏం జరుగుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కచ్చితంగా వెండితెరపై ఈ సినిమా చూడాల్సిందే.
నటీనటులు నటన:
ఈ చిత్రంలో లాయర్ గా నటించిన ప్రియదర్శి బాడీ లాంగ్వేజ్ దగ్గర నుండి సెక్షన్ల వరకు ఒక నిజమైన ఎలా అయితే చట్టాలను కంఠస్తం చేసి మాట్లాడతారో అదే విధంగా తన పాత్రను నూటికి నూరు శాతం సెటిల్డ్ గా పోషించడం జరిగింది. అటు ఎమోషన్స్ ను అలాగే ఇటు లాయర్ గా ప్రొఫెషన్‌ను బ్యాలెన్స్ చేసే చక్కటి పాత్ర పడిందని చెప్పుకోవాలి. బలగం తర్వాత అటువంటి పర్ఫామెన్స్ మరోసారి ఈ చిత్రంలో కనిపించింది. సాయికుమార్ స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ చిత్రానికి అలాగే ప్రియదర్శి క్యారెక్టర్ కు మంచి ఇంపాక్ట్. ముఖ్య పాత్రులైన రోషన్ ఇంకా శ్రీదేవి విషయానికి వస్తే ఇంత చిన్న వయసులోనే అంత బాగా నటించడం గొప్ప విషయం అని చెప్పుకోవాలి. శ్రీదేవి తొలిచిత్రమైనప్పటికీ ఎక్కడ కూడా ఆ డౌట్ రాకుండా ఎంతో బాగా నటించారు. రోషన్ ఇప్పటికే కొన్ని చిత్రంలో నటించగా ఈ చిత్రంలో ఎమోషన్‌ను ఎంతో బాగా క్యారీ చేస్తూ చూసే ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యే విధంగా నటించాడు. చిత్రం అంతట బాగా చెప్పబోదగిన క్యారెక్టర్ శివాజీ. మంగపతి క్యారెక్టర్ లో శివాజీ పూర్తిగా జీవించారు. ఇప్పటివరకు శివాజీ ఎన్నడూ చేయని క్యారెక్టర్ ఇది. మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ గా మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకుంటూ చూసే ప్రతి ప్రేక్షకుడు తన క్యారెక్టర్‌ను అసహ్యించుకునే విధంగా ఈ పాత్ర పోషించారు. ఈ సినిమాకు శివాజీ పెద్ద బోనస్. తన క్యారెక్టర్జేషన్, డైలాగ్స్, యాస ఇంకా తన నటన శైలిలో నటించడంలో రెచ్చిపోయారు. హర్షవర్ధన్ లాయర్ పాత్ర పోషిస్తూ అక్కడక్కడ ఉత్తరాంధ్ర యాసతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అలాగే శుభలేఖ సుధాకర్, రోహిణి, సురభి, విషిక కీర్తి, రాజశేఖర్ తదితరులు తమ తమ పాత్ర పరిధిలో నటిస్తూ చిత్రానికి ప్లస్‌గా నిలిచారు.


సాంకేతిక విశ్లేషణ:
దర్శకుడు రామ్ జగదీష్ తాను అనుకున్న అవుట్ పుట్‌ను తీసుకురావడంలో పూర్తిగా సక్సెస్ అయినట్లు అర్థమవుతుంది. పేపర్ పైన ఉన్న కథను ప్రేక్షకుల కళ్ళ ముందుకు తీసుకుని రావడంలో ఎక్కడా కూడా తడబాటు లేకుండా తన శైలిలో తాను దర్శకత్వం చేసినట్లు అర్థమవుతుంది. అటు నటీనటుల దగ్గర నుండి ఇటు సాంకేతిక బృందం వరకు ప్రతి ఒక్కరిని పూర్తిగా వాడుకున్నారు. అలాగే కోర్టు సెట్టు కూడా ఎంతో న్యాచురల్ గా వచ్చేలా జాగ్రత్త పడ్డారు. కోర్టులో ఎటువంటి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఎంత క్రమశిక్షణగా వ్యవహరించాల్సి ఉంటుందో అదే విధంగా ప్రతి నటీనటులు ప్రవర్తించే విధంగా చూసుకున్నారు. ఆటో డైరెక్టర్ కోర్టు సెట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాడో చిత్రంలో కర్ట్ సెట్ చూస్తేనే అర్థమవుతుంది. డిఓపి ఇంకా ఎడిటర్ చాలా పర్ఫెక్ట్ గా పనిచేసినట్లు అర్థమవుతుంది. సంగీత దర్శకుడు విషయానికొస్తే చిత్రంలోని ప్రతి సీనులోను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పండింది. ఇప్పటికే చార్ట్ బస్టర్ గా మారిన ప్రేమలో సాంగ్ కాకుండా సెకండ్ హాఫ్ లో వచ్చిన సాడ్ సాంగ్ కూడా సిచువేషన్ కు తగ్గట్లు పర్ఫెక్ట్ గా సింక్ అయింది. ఎమోషన్స్ ను అలాగే చిత్రంలోని కొన్ని హైపించే సీన్లను బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకా ఆర్ఆర్ తో మరింత ఇంపాక్ట్ వచ్చే విధంగా జాగ్రత్త పడ్డారు. సినిమా మొదలులో లవ్ స్టోరీ ఇంకా సెకండ్ హాఫ్ లో ఒకటి రెండు చోట్ల కొంచెం ల్యాగ్ అనిపించినప్పటికీ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేవిధంగా సినిమా ఉండటం వల్ల ఎక్కడ కూడా బోర్ ఫీల్ రాలేదు.
ప్లస్ పాయింట్స్:
కథ, దర్శకత్వం, సంగీతం, పాట, నటీనటుల నటన.
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ కొంచెం స్లోగా ఉండటం.
సారాంశం:
చట్టాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, ఎటువంటి చట్టాలను అవకాశవాదులు ఎటువంటి దుర్వినియోగాలకు వినియోగించుకుంటున్నారు తెలిసే విధంగా ఒక చక్కటి ప్రేమ కథ ఇంకా ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకులు అందరు ఆదరించే విధంగా కుటుంబ సమేతంగా వీక్షించేలా కోర్టు చిత్రం ఉంది.