ఘనంగా “ది సస్పెక్ట్” మూవీ ట్రైలర్ లాంఛ్

రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ది సస్పెక్ట్. ఈ చిత్రాన్ని టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు రాధాకృష్ణ రూపొందించారు. ది సస్పెక్ట్ సినిమా ఈ నెల 21న ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

ప్రొడ్యూసర్ పద్మినీ నాగులపల్లి మాట్లాడుతూ – ది సస్పెక్ట్ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఈ మూవీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. ఆర్టిస్టులు అందరూ బాగా పర్ ఫార్మ్ చేశారు. దర్శకుడు రాధాకృష్ణ ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ది సస్పెక్ట్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అన్నారు.

దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ – ది సస్పెక్ట్ మూవీ ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ప్రొడ్యూసర్ కిరణ్ గారు నాకు ఎప్పటినుంచో స్నేహితులు. ఆయన ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడమే కాదు మంచి క్యారెక్టర్ లో నటించారు. పెద్ద సినిమాలు జీరో కలెక్షన్స్ చేసినవి ఉన్నాయి. చిన్న చిత్రాలు అద్భుతంగా ఆదరణ పొందినవీ ఉన్నాయి. ది సస్పెక్ట్ సినిమా చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించాలి. ఈ సినిమా విజయం సాధిస్తే రాధాకృష్ణ లాంటి దర్శకులకు మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇలాంటి సినిమాలకు మంచి లాభాలు రావాలి. మీరంతా ది సస్పెక్ట్ చిత్రానికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా అన్నారు.

నిర్మాత కిరణ్ కుమార్ మాట్లాడుతూ – సినిమా రంగంలోకి రావాలనేది నా కల. ది సస్పెక్ట్ సినిమాతో ఆ కల నెరవేరింది. నా స్నేహితుడు వీఎన్ ఆదిత్య మా మూవీ ఈవెంట్ కు రావడం ట్రైలర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. రాధాకృష్ణ చేసిన ఒక షార్ట్ ఫిలిం చూసి నచ్చి ఈ సినిమాకు దర్శకత్వం చేయమని అడిగాను. రాధాకృష్ణే ఈ సినిమాకు అన్నీ తానై రూపొందించాడు. యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుని ఈ చిత్రంలో ఒక రోల్ చేశాను. ఈ మూవీలో అంతా కొత్తవాళ్లే అయితే వాళ్లకు నటనలో స్టేజీ ఎక్సిపీరియన్స్ ఉంది. వాళ్లంతా బాగా నటించారు. ది సస్పెక్ట్ సినిమా మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాఅన్నారు.

నిర్మాత లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ – ది సస్పెక్ట్ సినిమాలో సాంగ్ లాంఛ్ నా చేతుల మీదుగా చేయడం సంతోషంగా ఉంది. మూవీ ట్రైలర్ చాలా బాగుంది. దర్శకుడు వీఎన్ ఆదిత్య గారు ఈ సినిమాలో పాట రాయడం విశేషం. ఈ సినిమా కిరణ్ గారికి మంచి పేరు డబ్బు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు.

డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ – ఈ రోజు మా సస్పెక్ట్ సినిమా ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సినిమా చేసేందుకు పడే కష్టం చిన్న చిత్రానికైనా పెద్ద చిత్రానికైనా ఒక్కటే. మేము ఈ సినిమాను అందరికీ నచ్చేలా మంచి సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ గా రూపొందించాం. ఒక అమ్మాయి హత్యకు కారకులైన వారిని పట్టుకునే క్రమంలో సాగే చిత్రమిది. కొత్త ఆర్టిస్టులైనా ఎంతో అనుభవం ఉన్న వారిలా బాగా పర్ ఫార్మ్ చేశారు. ఈ మూవీ చేసే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కిరణ్ గారికి థ్యాంక్స్. మా సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న ఆదినారాయణ గారికి థ్యాంక్స్. ఈ నెల 21న థియేటర్స్ లోకి వస్తున్న ది సస్పెక్ట్ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు. ఈ చిత్రం ఎస్ కె ఎం ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా మార్చి 21న రిలీజ్ కాబోతుంది.

నటీనటులు – రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్, తదితరులు

టెక్నికల్ టీమ్ :

డీవోపీ – రాఘవేంద్ర
మ్యూజిక్ డైరెక్టర్ – ప్రజ్వల్ క్రిష్
ఎడిటర్ – ప్రవీణ్
నిర్మాత – కిరణ్ కుమార్
రచన, దర్శకత్వం – రాధాకృష్ణ
పీఆర్ఓ – చందు రమేష్