నితిన్ కి ‘రాబిన్‌హుడ్’ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది : నటకిరీటి రాజేంద్రప్రసాద్

హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో హీరో నితిన్ మాట్లాడుతూ ….మార్చి 28న రాబిన్‌హుడ్ వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. నిన్న వచ్చిన అది దా సర్ప్రైజ్ పాట కూడా చాలా పెద్ద హిట్ అయింది. దిల్ రాజు గారి వల్ల ఆ వర్డ్ పాపులర్ అయింది కాబట్టి ఆయనకి థాంక్స్ చెప్తున్నాను. జీవి ప్రకాష్ చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. డైరెక్టర్ వెంకీ నేను నిన్న రాత్రి సినిమా చూసుకున్నాం. ఈ సినిమా మా కెరీర్ హ్యుజ్ మూవీ కాబోతుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను. నా బర్త్ డే మార్చ్ 30. ఈ సినిమా వచ్చేది మార్చి 28. డైరెక్టర్ వెంకీ ఈ సినిమాతో నాకు బిగ్గెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. భీష్మ కి డబల్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుంది. నేను, శ్రీలీల, రాజేంద్రప్రసాద్ గారు వెన్నెల కిషోర్ మా సీన్స్ చాలా ఎక్స్ట్రార్డినరీగా వచ్చాయి. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. చాలా క్లీన్ కామెడీ ఉంటుంది. ఎక్కడ అసభ్యకరమైన మాట ఉండదు. ఇంత ఆర్గానిక్ కామెడీ ఈ మధ్యకాలంలో నేనెక్కడ చూడలేదు. ఇంత మంచి స్క్రిప్ట్ రాసిన డైరెక్టర్ వెంకీకి థాంక్యూ. మార్చి 28న వెంకీ కుడుముల విశ్వరూపం చూడబోతున్నారు. వెంకీకి ఇది 3.o. కథ ఎమోషన్ స్క్రీన్ ప్లే అత్యద్భుతంగా రాశాడు. క్లైమాక్స్ చూసిన తర్వాత ఆడియన్స్ వావ్ అంటారు. నాకు శ్రీలీలకు ఈ కనిమ ఒక హిట్ కపుల్ లా నిలబడుతుందనే కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మైత్రి మేకర్స్ లేకపోతే ఈ సినిమా ఇంత క్వాలిటీ గా వచ్చేది కాదు.మైత్రీ మూవీ మేకర్ కి థాంక్యూ వెరీ మచ్ మైత్రి మూవీ మేకర్స్ ఇండియాలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. ఈ సినిమాతో మరో సక్సెస్ చూడబోతున్నారు. మార్చి 28 థియేటర్స్ లో కలుద్దాం. తప్పకుండా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్ యూ. వెంకీ గారి నుంచి కొరుకునే వినోదం ఇందులో వుంటుంది. నా క్యారెక్టర్ మీరా చాలా స్పెషల్. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది. నితిన్ గారితో వర్క్ చేయడం సెకండ్ టైమ్. ఆయన చాలా సపోర్ట్ చేశారు, నా క్యారెక్టర్ గురించి కూడా కేర్ తీసుకున్నారు. రాజేంద్రప్రసాద్ గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఇందులో ప్రతి ఎలిమెంట్ చాలా నచ్చింది. మైత్రీ మేకర్స్ తో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఈ సినిమా తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది’ అన్నారు.

డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ.. సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. తప్పకుండా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. నా బెస్ట్ వర్క్ ఇదే. చాలా టైం దొరికింది. ఆ టైం ని చాలా అద్భుతంగా వాడుకున్నాం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం మా ప్రొడ్యూసర్ నవీన్ గారు రవి గారు. ఎక్కడ రాజీ పడకుండా సినిమాని చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ సినిమాకి బ్యాక్ బోన్ నితిన్ అన్న. ఈ సినిమా కథ నచ్చి సినిమా చేసిన శ్రీలీల గారికి థాంక్ యూ. నేను రాజేందర్ ప్రసాద్ గారికి చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ ని. ఇందులో క్యారెక్టర్ ఆయన ఉద్దేశించి రాశాను. అది మీరు స్క్రీన్ పై ఎంజాయ్ చేయాలి. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మార్చి 28న తప్పకుండా సినిమా చూడండి. ఇందులో మంచి ఫన్ వుంది. మీరు సర్ప్రైజ్ అయ్యే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమాలో క్యామియో చేసిన డేవిడ్ వార్నర్ గారికి థాంక్యూ. త్వరలో ఆయన కూడా వస్తారు మీరందరూ చూస్తారు’ అన్నారు.

నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మేము చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. ఇప్పటివరకు వదిలిన మూడు సాంగ్స్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ఫోటోగ్రఫీ అన్నీ అద్భుతంగా వుంటాయి . ఈ ఫార్మేట్ లో ఇంతకంటే బెస్ట్ కమర్షియల్ సినిమా రాదేమో అనిపించింది. వెంకి మంచి కమర్షియల్ ప్యాకెట్ సినిమా ఇస్తాడు. ఈ సినిమా కూడా అలాగే చేశాడు. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంది. మంచి యాక్షన్ ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి కథ ఉన్న సినిమా ఇది. మంచి సక్సెస్ అవుతుందని అందరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. నితిన్ గారికి థాంక్స్ చెప్పాలి. ఆయన చాలా సపోర్ట్ చేశారు ఆయన సపోర్ట్ వల్లే సినిమా అద్భుతంగా వచ్చింది. నితిన్ శ్రీలల కాంబినేషన్ స్క్రీన్ పై ముచ్చటగా ఉంటుంది. రాజేంద్రప్రసాద్ గారి క్యారెక్టర్ కూడా చాలా హిలేరియస్ గా ఉంటుంది. ఈ సినిమా మాకు చేసినందుకు ఆయనకి చాలా థాంక్స్. ఇందులో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఎంటర్టైన్మెంట్ ని ఇరగదీసారు. మార్చి 28న ఆడియన్స్ చూడబోతున్నారు. వెంకీ తీసిన చలో భీష్మ పెద్ద సక్సెస్ అయ్యాయి. ఈ సినిమా అంతకుమించి సక్సెస్ కాబోతుంది. ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమాని చేశారు. ఈ సినిమా ప్రేక్షకుల్ని అద్భుతంగా అలరిస్తుంది’ అన్నారు.

నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… మైత్రి మూవీస్ లో ఇంతకుముందు శ్రీమంతుడు, వాల్తేరు వీరయ్య సినిమాలు చేశాను. రాబిన్ వుడ్ సినిమాలో నటించిన తర్వాత మళ్లీ నాకు నా పాత్ర రోజులు గుర్తొచ్చాయి నేను హీరోగా చేసిన సినిమాలన్నీ గుర్తుకొచ్చాయి. వెంకీ కుడుముల ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చాడు. ఇంత క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. నితిన్ కి ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఒక అద్భుతమైన కథతో ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసిన సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్ ని అద్భుతంగా అలరిస్తుంది’ అన్నారు.