
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలలో గతంలో మితిమీరిన వ్యాఖ్యలు చేసిన కారణంగా నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. సుమారు 15 కేసులలో వివిధ స్టేషన్లలో ఆయనపై కేసు నమోదు కావడం జరిగింది. కాగా ఆదోని, విజయవాడ కోర్టుల్లో బెయిల్ మంజూరు అయింది. ఇప్పటికే పోసానికి రాజంపేట, నరసరావుపేటలో బెయిల్ కాగా మొత్తం నాలుగు కేసుల్లో పోసానికి బెయిల్ మంజూరు.ఇతర కేసుల్లో BNS చట్టం కిందపోసానికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం. ప్రస్తుతం కర్నూలు జైలులో ఉన్న పోసాని కృష్ణమురళి. రేపు జైలు నుంచి పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది.