
అత్యున్నత సాంకేతిక పరిజ్క్షానంతో నేటి మన సినిమాలు హాలీవుడ్ సినిమాలతో పోటీపడుతున్నాయి. ప్రేక్షకులు కంటెంట్‌తో పాటు తమను అబ్బురపరిచే సాంకేతిక పరిజ్క్షానం వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. అందుకే మన దర్శక నిర్మాతలు ఎప్పటికప్పుడూ కొత్త సాంకేతిక పరిజ్క్షానంను మన సినిమాల్లో వాడుతుంటారు. తాజా ఇలాంటి ఓ సరికొత్త ప్రయోగం చేసింది టుక్ టుక్ చిత్ర టీమ్. తొలిసారిగా ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో సినిమాకు సంబంధించిన ఓ పాటను చిత్రీకరించారు. ఇది ఇండియన్ సినిమాలోనే తొలిసారి. ‘ఏలా అల తీపికోరే పూలతోట’ అనే కొనసాగే ఈపాట విజులవ్స్ ఏఐ టెక్నాలజీతో ఎంతో అందంగా, స్టనింగ్ విజువల్స్ బ్యూటీఫుల్‌గా జనరేట్ చేశారు. దర్శకుడు సుప్రీత్ కృష్ణ సాహిత్యం అందించిన పాటకు సంగీత దర్శకుడు సంతు ఓంకార్ స్వరాలు అందించారు. ఏఐ ఈ పాటను బ్యూటిఫుల్‌గా పిక్చరైజ్ చేసింది. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు,సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.సుప్రీత్ కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని మరియు ఆర్ వై జి సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణలు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్.
దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఏ ఐ టెక్నాలజీతో పాటను చిత్రీకరించడం ఎంతో ఆనందంగా ఉంది. తప్పకుండా థియేటర్‌లో ఆడియన్స్ ఈ పాటను ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి టెక్నాలజీని సినిమాల్లో తొలిసారిగా మా సినిమాకు వాడటం గర్వంగా ఉంది. సినిమా కూడా ఓ న్యూకాన్పెప్ట్‌లో ఉంటుంది. ఫాంటసీతో పాటు కొన్ని మ్యాజికల్ ఎలిమెంట్స్ చిత్రంలో ఉంటాయి. అవి ఆడియన్స్‌కు థ్రిల్ల్‌ను కలిగిస్తాయి. ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న ఈ చిత్రం అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ… ‘ఈ సినిమాలో సూపర్ నేచురల్, మ్యాజికల్ పవర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ఉన్న చాలా సర్‌ఫ్రైజెస్ ఎంజాయ్ చేయడానికి అందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూడాలి’ ముగ్గురు యువకుల ప్రయాణం. వాళ్ల జీవితంలో వచ్చిన మ్యాజికల్ ఎలిమెంట్స్‌ను ఎలా ఫేస్ చేశాడో ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. తప్పకుండా ఈ సినిమా అందరి హృదయాలకు హత్తుకుంటుందనే నమ్మకం ఉంది.’ ఫస్ట్ హాఫ్ ముగ్గురు యువకుల ఎంటర్‌టైన్ ఉంటే సెకండాఫ్‌లో బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ఉంటుంది. సాధారణంగా పెద్ద సినిమాల్లో ఫాంటసీ అంశాలు ఉంటాయి. ఈ సినిమాలో ఫాంటసీ, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నాయి. మార్చి 21న అందరూ థియేటర్‌లో ఎంటర్‌టైన్ అవ్వొచ్చు. టైమ్‌కు, మనీకి వాల్యూ ఇచ్చే సినిమా ఇది’ అన్నారు.
తారాగణం:
హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: సి.సుప్రీత్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ సాయికుమార్
సంగీతం: సంతు ఓంకార్
ఎడిటర్: అశ్వత్ శివకుమార్
నిర్మాతలు:
రాహుల్ రెడ్డి
లోక్కు శ్రీ వరుణ్
శ్రీరాముల రెడ్డి
సుప్రీత్ సి కృష్ణ
పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను, మాడురి మధు