ఆకట్టుకున్న “సంతాన ప్రాప్తిరస్తు” టీజర్

విక్రాంత్, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా టీజర్ ఇటీవల విడుదలై భారీ స్పందన తెచ్చుకుంది. ఈ టీజర్‌ను తాజాగా గానా & రేడియో మిర్చి నిర్వహించిన మైండ్ స్పేస్ ఎకో రన్ లో ప్రదర్శించారు. ఈ టీజర్ ఎకో రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ చౌదరి, నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి, దర్శకుడు సంజీవ్ రెడ్డి, రైటర్ షేక్ దావూద్ జీ పాల్గొన్నారు.

ఈ చిత్రంలో హీరో విక్రాంత్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కావడంతో, టీజర్‌లో అతని క్యారెక్టర్‌ను చూసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమతో బాగా రిలేట్ అయ్యారు.

ఈ ఈవెంట్‌ను గానా & రేడియో మిర్చి సౌత్ రీజనల్ కంటెంట్ డైరెక్టర్ వాణి మాధవి అవసరాల ప్లాన్ చేసి విజయవంతంగా నిర్వహించారు.

నేటి సమాజంలో యువత ఎదుర్కొంటున్న ఓ సమస్యను ఇతివృత్తంగా తీసుకుని, యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

సినిమా తారాగణం:
వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, శ్రీ లక్ష్మి, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తగుబోతు రమేష్, అభయ్ బేతిగంతి, కిరీటి, అనిల్ గీలా, సద్దాం.

సాంకేతిక బృందం:
దర్శకుడు: సంజీవ్ రెడ్డి
నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
కథ & స్క్రీన్‌ప్లే: సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్ జి
సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఏ. మధుసూదన్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: మాహి రెడ్డి పండుగుల
సంభాషణలు: కళ్యాణ్ రాఘవ
ఎడిటర్: సాయి కృష్ణ గనాలా
నృత్య దర్శకుడు: లక్ష్మణ్ కళహస్తి
ప్రొడక్షన్ డిజైనర్: శివకుమార్ మచ్చ
కాస్ట్యూమ్ డిజైనర్స్: అశ్వత్ భైరి, కె. ప్రతిభ రెడ్డి
మార్కెటింగ్ & ప్రమోషన్ కన్సల్టెంట్: విష్ణు కోమల్లా
పబ్లిసిటీ డిజైన్: మాయాబజార్
డిజిటల్: హౌస్‌ఫుల్ డిజిటల్
పీఆర్ఓ: జీఎస్కే మీడియా (సురేష్ & శ్రీనివాస్)