
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన AGS ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మించారు. ఫిబ్రవరి 21న వచ్చిన ఈ చిత్రం వంద కోట్ల క్లబ్బులో జాయిన్ అయింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో యూనిట్ అంతా కలిసి సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. సోమవారం నిర్వహించిన ఈ సక్సెస్ మీట్లో..
ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ .. ‘ఓ ఫ్రెండ్‌కు మంచి సినిమా ఇవ్వాలని అశ్వత్ ఈ కథను మొదలు పెట్టారు. ప్రయత్నిస్తే కచ్చితంగా జరుగుతుంది అనే పాయింట్‌తో ఈ సినిమాను స్టార్ట్ చేశాం. మంచి సినిమాను చేయాలనే ఉద్దేశంతోనే మా నిర్మాత అర్చనా మేడం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌ను థియేటర్లో చూసి అశ్వత్ ఎమోషనల్ అయ్యారు. తెలుగు ఆడియెన్స్ చూపించిన ప్రేమకు మేం ముగ్దులం అయ్యాం. లియోన్ జేమ్స్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ఆడియెన్స్‌కు థాంక్స్. అనుపమ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అడాప్టెడ్ సన్ అంటూ నా మీద మీమ్స్ వేస్తున్నారు. నన్ను మీలో ఒకడిగా చేర్చుకున్నందుకు థాంక్స్. తెలుగు ఆడియెన్స్‌కి ఎప్పుడూ రుణపడి ఉంటాను’ అని అన్నారు.
అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ .. ‘రాజమౌళి గారు నాకు స్పూర్తి. సినిమాలో ఎమోషన్ కనెక్ట్ అయితే అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అవుతుందని ఆయన నిరూపించారు. ప్రేమ, స్నేహం, తల్లిదండ్రులు అనేది యూనివర్సల్ కాన్సెప్ట్. ఈ మూడు కూడా మా సినిమాలో ఉన్నాయి. అందుకే మా చిత్రాన్ని ఆడియెన్స్ ఇంత పెద్ద హిట్ చేశారు. నా టీం, హీరోతో ఉన్న స్నేహం వల్లే మా చిత్రం ఇంత బాగా వచ్చింది. మహేష్ బాబు గారు ఓ మై కడవలే సినిమా గురించి ట్వీట్ వేయడంతో బాగా రీచ్ వచ్చింది. తెలుగు ఆడియెన్స్ అంతా ఆ సినిమాను చూశారు. ఇప్పుడు మా డ్రాగన్ మూవీని కూడా ఆయన చూసి ట్వీట్ చేయాలని కోరుకుంటున్నాను. తమిళనాడులో ఈ సినిమా చాలా బాగా రన్ అవుతోంది. తెలుగులోనూ ఆడియెన్స్ అంతే బాగా ఆదరిస్తున్నారు. మా సినిమా చాలా కలర్ ఫుల్‌గా ఉంటుంది. సినిమా అంతా నవ్వించాం. కానీ ఎండింగ్లో మాత్రం మంచి సందేశాన్ని ఇచ్చి పంపిస్తాం. మున్ముందు మరిన్ని మంచి చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వస్తాను’ అని అన్నారు.

రవి శంకర్ మాట్లాడుతూ .. ‘‘డ్రాగన్’ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. కేవలం యూత్ సినిమా కాదు. ఎంత వినోదం ఉన్నా కూడా అంతర్లీనంగా మంచి సందేశాన్ని ఇచ్చారు. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రమిది. ఇంకా చూడని వాళ్లుంటే వెంటనే వెళ్లి చూడండి’ అని అన్నారు.
అర్చనా కల్పతి మాట్లాడుతూ .. ‘మా సినిమాను ఇంతలా ఆదరిస్తున్న తెలుగు ఆడియెన్స్‌కు, మీడియాకు థాంక్స్. మా సినిమాను ఇంత గ్రాండ్‌గా రిలీజ్ చేసిన మైత్రి మూవీస్‌కు, శశి గారికి, రవి గారికి థాంక్స్’ అని అన్నారు.
మైత్రి శశిధర్ మాట్లాడుతూ.. ‘మా సినిమాను ఇంత బాగా ఆదరించి హిట్ చేసిన ఆడియెన్స్, సపోర్ట్ చేసిన మీడియాకు థాంక్స్. మాకు ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇచ్చిన అర్చనా గారికి థాంక్స్. ఇది చాలా గొప్ప సినిమా. అశ్వత్ డైరెక్షన్, ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మాదిరే కాలేజ్ టైంలో మాకు మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు. మాలాంటి వాళ్లందరికీ చాలా కనెక్ట్ అయింద’ని అన్నారు.
లియోన్ జేమ్స్ మాట్లాడుతూ.. ‘తెలుగు ఆడియెన్స్ డ్రాగన్ మూవీని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీకి మీరంతా చూపించిన ప్రేమకు థాంక్స్. ఇంకా సినిమాని చూడని వాళ్లుంటే వెంటనే చూడండి’ అని అన్నారు.