“అగాథియా” చిత్ర రివ్యూ

తమిళ నటుడు జీవ, రాశిఖన్నా జంటగా నటిస్తూ విజయ్ రచన దర్శకత్వంలో వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ వామ్ ఇండియా నిర్మాణ సంస్థ ద్వారా ఫిబ్రవరి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అగాథియా. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. ఎడ్వర్డ్ సొన్నెంబ్లిక్, షా రా, రోబో శంకర్, చార్లీ, రోహిణి తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారు. పిరియాడిక్ హారర్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రానికి గణేష్, అర్జునుడు నిర్మాతలుగా వ్యవహరించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించగా దీపక్ కుమార్ సినిమాటోగ్రఫీ చేశారు. ఇక ఈ చిత్ర విషయానికి వస్తే…

కథ :
ఆర్ట్ డైరెక్టర్ గా మొదలైన జీవ తన తొలి ప్రయాణంలోనే అనుకోని సంఘటన వల్ల తన జీవితంలో ఎంతో నష్టపోతాడు. అయితే నష్టపోయిన చోటనే మళ్లీ సంపాదించుకునేందుకు తాను ఒక బంగ్లాలోకి ప్రవేశిస్తాడు. ఆ బంగ్లా ద్వారానే తను నష్టపోయిన అంతటినీ సంపాదించుకునే దిశగా ముందుకు వెళుతుండగా అనుకోని విధంగా తనకు మరికొన్ని ప్రమాదకరమైన అడ్డంకులు ఎదురవుతాయి. ఆ అడ్డంకులను తాను, తన ప్రేయసి రాసి కన్నా, ఇంకా తన మిత్రులతో కలిసి ఎలా అడ్డుకుంటాడు అనేది ఈ చిత్ర కథ. అయితే ఆ అడ్డంకులు ఎటువంటివి? ఈ కథలోకి అర్జున్ ఎలా వస్తారు? జీవ తల్లి రోహిణికి ఉన్న సమస్య ఏంటి? ఆ సమస్య తీర్చేందుకే జీవ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదంలోకి వెళ్లి ఎటువంటి ఇబ్బందులు పడతాడు? చివరికి తను ఆ ప్రమాదకర పరిస్థితుల నుండి బయట పడతాడా లేదా? అసలు చివరికి ఏం జరుగుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రం చూడాల్సిందే.

నటీనటుల నటన:
చిత్రం టైటిల్ పాత్ర పోషిస్తూ జీవ ఎంతో బాగా నటించారు. చిత్రంలో యాక్షన్ ఇంకా ఎమోషనల్ సీన్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. రాసి కన్నా తన పాత్ర పరిధిలో తను నటిస్తూ మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. అదేవిధంగా అర్జున్ స్క్రీన్ పై తక్కువ సమయం కనిపించినప్పటికీ తన పాత్ర సినిమా అంతటికి మంచి ఇంపాక్ట్ వచ్చేలా చేసింది. అలాగే చిత్తంలో నటించిన రోహిణి, చార్లీ, రోబో శంకర్ తదితరులు తమ పాత్ర పరిధిలో తాము నటిస్తూ ఆ పాత్రలకు జీవం పోస్తూ సినిమాకు మంచి ప్లస్ గా నిలిచారు. అదేవిధంగా చిత్రంలోని నటించిన ఇతర నటీనటులు అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో సినిమాకు బోనస్ గా నిలిచారు.

సాంకేతిక విశ్లేషణ :
కథ రాసుకోవడంలో అలాగే ఆ రాసుకున్న కథను పర్ఫెక్ట్ గా అమలు చేస్తూ దర్శకత్వం చేయడంలో విజయ్ సక్సెస్ అయ్యారు. నటీనటుల పర్ఫార్మెన్స్ దగ్గర నుండి సాంకేతిక నిపుణులను వాడుకోవడం వరకు విజయ్ తనదైన శైలిలో మంచి అవుట్ ఫుట్ వచ్చేలా జాగ్రత్త పడ్డారు. నిర్మాణవులలో ఎక్కడ కాంప్రమైజ్ అయినట్లు కనిపించలేదు. కెమెరామెన్ చిత్రాన్ని తన కెమెరాలు బంధించడంలో సక్సెస్ అయ్యారు. అదేవిధంగా చిత్రంలో ప్రతి సీన్ లోను సీన్ కు తగ్గట్లు చక్కటి బిజియంతో అక్కడక్కడ భయపెట్టే విధంగా మంచి సంగీతాన్ని అందించారు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా. అలాగే కలరింగ్, విజువల్ ఎఫెక్ట్స్ తదితర సాంకేతిక విషయాలలో ఎంత జాగ్రత్త తీసుకున్నట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా కొన్ని విజువల్స్ పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్ తో కన్నుల పండుగలా అనిపించాయి. ఆర్ట్ డైరెక్టర్ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్ లో ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకున్నట్లు అర్థమవుతుంది.

ప్లస్ పాయింట్స్:
కథ, దర్శకత్వం, బిజిఎం, నటీనటుల నటన.

మైనస్ పాయింట్స్:
సినిమా ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది అనిపించడం.

సారాంశం:
థ్రిల్లర్ పిరియాడిక్ చిత్రంగా మంచి యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను భయపెట్టే విధంగా హారర్ ఎలిమెంట్స్ తో పూర్తి వినోదాన్ని అందించే చిత్రంగా అగాథియా నిలిచింది.