
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ హైలీ ఎంటర్ టైనింగ్ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ దండా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
బచ్చలమల్లి తర్వాత మీ నుంచి వస్తున్న ‘మజాకా’పై మీ అంచనాలు ఏమిటి ?
-ఒక డిఫరెంట్ సినిమా చేయాలని బచ్చలమల్లి చేశాను. మజాకా మంచి ఎంటర్ టైనర్. ఫ్యామిలీ సినిమా. డైరెక్టర్ త్రినాధ్ రావు, రైటర్ ప్రసన్న గారి స్టయిల్ లో వుండే మాస్ ఎంటర్ టైనర్. ఇకపై కూడా మంచి ఎంటర్టైన్మెంట్ వున్న సినిమాలనే చేస్తాను.
మజాకా పాటలు ట్రైలర్ పెద్ద గ్యాప్ లేకుండా రిలీజ్ చేశారు కదా.. దీని వలన రీచ్ కి ఏమైనా ఇబ్బంది ఉందా?
-టీజర్ ముందే రిలీజ్ చేశాం. అది జనాల్లో వుంది. ట్రైలర్ కి కంటే ముందు సోమ్మసిల్లి పాట రిలీజ్ చేశాం, అది టాప్ ట్రెండింగ్ లో వుంది. మాకు రిలీజ్ డేట్ ముఖ్యం. దాని కోసం అందరం కష్టపడి పని చేశాం.
లైవ్ షూటింగ్ ఇవ్వాలనే ఐడియా ఎవరిది ?
-అనిల్ గారిది. రిలీజ్ డేట్ కి తక్కువ టైం వుంది. ఏదైనా కొత్తగా ప్లాన్ చేయాలనుకున్నప్పుడు అనిల్ గారు ఆ ఆలోచన చెప్పారు. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా బిజినెస్ విషయంలో హ్యాపీగా వున్నారా ?
-చాలా హ్యాపీ. ఈ సినిమాని ప్రాఫిట్స్ లో రిలీజ్ చేస్తున్నాను. సందీప్ కిషన్ గారి కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ రిలీజ్.
రావురమేష్ గారి ఛాయిస్ ఎవరిది ?
-డైరెక్టర్ గారు ఫాదర్ రోల్ కి ముందు నుంచి రావు రమేష్ గారిని అనుకున్నారు. ఆయన పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో కామెడీ చాలా ఫ్రెష్ గా వుంటుంది.
మజాకాలో మెసేజ్ ఉందా ?
ఇందులో ఎంటర్ టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ కూడా వుంది. ఇద్దరు బ్యాచిలర్స్ వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవాలని తపన పడతారు. అది సినిమాలో బ్యూటీఫుల్ ఎమోషన్.
మజాకా పెయిడ్ ప్రిమియర్స్ ప్లాన్ చేస్తున్నారా ?
-ప్లానింగ్ లో వున్నాం. రేపు పెయిడ్ ప్రిమియర్ వేయాలని ప్లాన్ చేస్తున్నాం.
ఆల్రెడీ సినిమా చూసుంటారు కదా.. ఎలా అనిపిస్తోంది ?
-ఖచ్చితంగా చాలా మంచి సినిమా అవుతుంది. మంచి ఎంటర్ టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోషన్ వున్న సినిమా. ఇంటర్వెల్ కి మంచి ట్విస్ట్ వుంటుంది. అది సెకండ్ హాఫ్ ని ఎలా లీడ్ చేస్తోందో చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుంది. సందీప్ రావు రమేష్ సీన్స్, సందీప్ రీతు లవ్ స్టొరీ, అలాగే రావు రమేష్ అన్షు ట్రాక్ కూడా చాలా బావుంటుంది. సందీప్ కి భైరవ కోన కంటే బెటర్ సినిమా అవుతుంది.


మజాకా సినిమాని ఆల్రెడీ చూసిన వారి రెస్పాన్స్ ఏమిటి ?
-నా ఫ్రెండ్స్, కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కి సినిమా చూపించాం. ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్ చాలా బావుందని చెప్పారు. పాటలు చాలా ఎంజాయ్ చేశారు. నేను ఏదైతే నమ్మానో అది వర్క్ అవుట్ అయ్యింది.
సామజవరగమన సీక్వెల్ ఎప్పుడు ?
-మా రైటర్ భాను రవితేజ గారితో సినిమా చేస్తున్నారు. అది కంప్లీట్ అయ్యాక కథ రెడీ చేయాలి.
అనిల్ గారితో మీ కొలాబరేషన్ ఎలా వుంది ?
-నెక్స్ట్ ఇయర్ ఓ పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ లోనే అనౌన్స్ మెంట్ వుంటుంది.
టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి ?
-మంచి ఎంటర్ టైన్మెంట్ వున్న టైటిల్ పెట్టాలని అనుకున్నాం. ఒక సెలబ్రేషన్ వైబ్ వున్న సినిమా ఇది. మాజకా టైటిల్ పర్ఫెక్ట్ అనిపించింది.
త్రినాథ్ రావు నక్కిన గారితో వర్క్ చేయడం గురించి ?
-ఆయనతో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. సినిమాని అద్భుతంగా తీశారు. ఆయనతో మరో సినిమా చేయాలని వుంది. ఇదే సినిమాకి సీక్వెల్ చేయాలని ఆలోచన వుంది. సినిమా ఎండ్ లో డబుల్ మజాకా అనే టైటిల్ కూడా వేశాం.
మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ?
-సంయుక్తతో ఓ ప్రాజెక్ట్ జరుగుతోంది. అలాగే కిరణ్ అబ్బవరంతో సినిమా షూటింగ్ జరుగుతోంది.