తెలుగు సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన కోడి రామకృష్ణ గారిని స్మరించుకుంటూ

తెలుగు సినిమా చరిత్రలో అనేక మంది దర్శకులు, నిర్మాతలు, కళాకారులు తమ అద్వితీయ కృషితో సినిమా ప్రపంచాన్ని మార్చి, వినోదం, సందేశాలను ప్రేక్షకులకు అందించారు. అటువంటి మహనీయులలో కోడి రామకృష్ణ గారు ఒకరు. ఆయన తెలుగు సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అనే కొత్త డైమెన్షన్ ను తీసుకువచ్చి, సినిమా ప్రపంచాన్ని ఎప్పటికీ మార్చివేసిన దర్శకుడు. ఈరోజు తెలుగు సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అంటే అది ఆరోజు అయన వేసిన పునాదే.. అలాంటి ఆహానియుడి గురించి ఒక్క సారి అయన 6 వర్ధంతి సందర్భంగా గుర్తుచేసుకుందాం.

కోడి రామకృష్ణ గారు 1949 జూలై 23న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. ఆయన తన కెరీర్ ను ఒక అసోసియేట్ డైరెక్టర్ గా ప్రారంభించారు, కానీ కొంత కాలానికే దర్శకత్వం వైపు మళ్లించుకున్నారు. ఆయనకు సినిమాటిక్ టెక్నిక్స్ & స్టోరీ టెల్లింగ్ పై గాఢమైన అవగాహన, ప్యాషన్ ఉండేది. అదే ఆయనను తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా మార్చింది.

కోడి రామకృష్ణ గారి అత్యంత ముఖ్యమైన కృషి అనేది తెలుగు సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ ను పరిచయం చేయడం. ఆ కాలంలో భారతీయ సినిమా ప్రపంచంలోనే విజువల్ ఎఫెక్ట్స్ అనేది చాలా కొత్త, పెద్దగా ఎవరు కూడా అన్వేషించబడని రంగం. కానీ కోడి రామకృష్ణ గారు ఈ టెక్నాలజీని తెలుగు సినిమాకు తీసుకువచ్చి, దానిని ఒక కళారూపంగా మార్చారు. ఈరోజు ఎఫెక్ట్స్ 25th క్రాఫ్ట్ గా మారింది.

ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు విజువల్ ఎఫెక్ట్స్ ను ఉపయోగించి, ఆయన చేసిన ఫాంటసీ ఫిలిమ్స్ అమ్మోరు, దేవి, దేవ్వుళ్ళు, అంజి, అరుంధతి ఇలా ఒక్కో సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేసాయి. ఈ సినిమాలు తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. ఆ సినిమాల ద్వారా ప్రేక్షకులకి కూడా సినిమాని చూసే దృష్టే మార్చేసిన విజనరీ కోడి రామకృష్ణ గారు. మరి అంతటి మహానుభావుడిని స్మరించుకోవడం మన కర్తవ్యం.