OTTలోకి వచ్చేసిన ‘డాకు మహారాజ్’

బాబీ కొల్లి దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘డాకు మహారాజ్’ ఓటీటీలోకి వచ్చేసింది. నెటిక్స్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ. 170 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందించగా, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రల్లో నటించారు.