
ఉన్ని ముకుందన్ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ “మార్కో” ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా రేపటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు హనీఫ్ అడేని రూపొందించారు. క్యూబ్ ఎంటర్ టైన్ మెంట్స్, ఉన్ని ముకుందన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి.
ఈ రోజు మార్కో కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్ తో ఆకట్టుకుంటోంది. తను ఎంతో ప్రేమించే సోదరుడు విక్టర్ ను చంపిన వారిపై మార్కో పగ తీర్చుకునే తీరు హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సులతో ఇంప్రెస్ చేసింది. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ తో పాటు సిద్ధిక్, జగదీష్, అభిమన్యు ఎస్ తిలకన్, కబీర్ దుహాన్ సింగ్, అన్సన్ పాల్, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ రిలీజ్ మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించింది. మార్కో తెలుగులోనూ రిలీజై ఘన విజయాన్ని అందుకుంది. ఆహా ఓటీటీ ద్వారా మార్కో సినిమా మరింతమంది మూవీ లవర్స్ కు రీచ్ కానుంది.