

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో HIT సిరీస్‌లో మూడవ భాగంగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్లకు అద్భుతమైన స్పందనతో భారీ అంచనాలను నెలకొల్పింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది.
ఈ చిత్ర టీజర్‌కు సంబంధించిన అప్డేట్తో మేకర్స్ వచ్చారు. ఈ చిత్రం ఇంటెన్స్ టీజర్‌ను ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ప్రధాన కథాంశం, నాని పోషిస్తున్న ఫెరోషియస్ అర్జున్ సర్కార్ క్యారెక్టర్ తో పాటు మిగతా పాత్రల గురించి కీలక వివరాలను ఆవిష్కరించడానికి టీం సిద్ధంగా ఉంది.
టీజర్ పోస్టర్ లో నాని చేతిలో గొడ్డలి పట్టుకొని, తన పాదాల దగ్గర పడిపోయిన మనుషులతో కమాండింగ్ పోజిషన్ లో కనిపిస్తున్నారు. ఈ బోల్డ్ ఇమేజ్ అతని పాత్ర యొక్క ఫెరోషియస్ అండ్ ఇంటెన్స్ నేచర్ ని తెలియజేస్తోంది.
ఈ చిత్రంలో నానికి జోడిడా శ్రీనిధి శెట్టి కథానాయిక పాత్రలో నటించింది. ఈ మూవీకి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం వర్క్ చేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ డీవోపీ, మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్.
HIT 3 మే 1, 2025న థియేటర్లలోకి రానుంది.
తారాగణం: నాని, శ్రీనిధి శెట్టి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: డా. శైలేష్ కొలను
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
బ్యానర్లు: వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్
డీవోపీ: సాను జాన్ వర్గీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
సౌండ్ మిక్స్: సురేన్ జి
లైన్ ప్రొడ్యూసర్: అభిలాష్ మాంధదపు
చీఫ్ కో-డైరెక్టర్: వెంకట్ మద్దిరాల
కాస్ట్యూమ్ డిజైనర్: నాని కమరుసు
SFX: సింక్ సినిమా
VFX సూపర్వైజర్: VFX DTM
DI: B2h స్టూడియోస్
కలరిస్ట్: S రఘునాథ్ వర్మ
పీఆర్వో: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో