
జబర్దస్త్ నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకుడిగా ధనరాజ్, సముద్ర కని టైటిల్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం గ్రామం రాఘవం. అలనాటి రామచంద్రుడు చిత్ర ఫేమ్ మోక్ష హీరోయిన్గా నటించారు. పృథ్వి నిర్మాతగా అరుణ్ చిలువేరు సంగీత దర్శకుడిగా చేశారు. ప్రమోదిని, సునీల్, 30 ఇయర్స్ పృథ్వి, సత్య, చిత్రం శ్రీను, రచ్చ రవి, శ్రీనివాస్ రెడ్డి, వాసు ఇంటూరి, హరీష్ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21వ తేదీన విడుదల కావడం జరిగింది. ఇక చిత్ర విషయానికి వస్తే…
కథ :
ధనరాజ్(రాఘవ) గా, తన తండ్రి పాత్రలో సముద్ర కని (రామం)గా టైటిల్ పాత్రలు పోషించారు. ఓ సామాన్య మధ్య తరగతి కుటుంబంలోని తండ్రి కొడుకుల మధ్య జరిగే కథగా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. బాధ్యతలేని కొడుకు స్థిరపడకుండా తన తండ్రి ఆదాయంపై బ్రతుకుతూ ప్రతి చోట తప్పు చేస్తూ ఉండటంతో తన కొడుకు అలా పాడైపోతున్నాడని బాధపడుతూ ఉంటాడు తండ్రి. ఇది ఇలా ఉండగా తప్పు పై తప్పు చేస్తూ ఉంటాడు కొడుకు. ఈ సమయంలోనే తనకు ఒక అమ్మాయి కనిపిస్తుంది. అయితే ఆ అమ్మాయితో కొడుకు రాఘవ ప్రయాణం ఎలా ఉండబోతుంది? ఆ ప్రయాణం ఎంతవరకు వెళ్లబోతుంది? తన తప్పులు తలలో తెలుసుకున్నాకైనా సరే కొడుకు బాగుపడతాడు? లేదా అలాగే తప్పుపై తప్పు చేసుకుంటూ వెళ్తాడా? చివరికి తన తండ్రితో ఎటువంటి రిలేషన్ ఉండబోతుంది? డబ్బు పై ఆశ ఎటువంటి సమస్యలను తీసుకొస్తుంది? చివరిగా వారి జీవితాలు ఎటువైపు వెళ్ళబోతున్నాయి? అనే విషయాలు తెలియాలంటే వెండితెలపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన:
ఈ చిత్రంలో టైటిల్ పాత్రలు పోషించిన ధనరాజ్, సముద్ర కని పాత్రల గురించి ముందుగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు ధనరాజును ఎక్కువగా హాస్య పాత్రలోనే చూసాము. కానీ ఈ చిత్రంలో ఎమోషన్తో కూడిన ఒక పూర్తి నటుడుని చూస్తాము. ముఖ్యంగా ఎమోషన్స్ బాగా పండిస్తూ తనకు కామెడీ యాక్టర్ అనే విషయాన్ని చూసే ప్రేక్షకులు ఎక్కడ అనిపించకుండా చాలా బాగా నటించారు. అలాగే తండ్రి పాత్రలో సముద్రఖని పర్ఫెక్ట్ గా చేశారు. ఇప్పటికే రఘువరన్ బీటెక్, డాన్ వంటి చిత్రాలలో తండ్రి పాత్ర అద్భుతంగా పోషించారు. అదేవిధంగా ఈ చిత్రంలో కూడా తండ్రి పాత్రలో ఎమోషనల్ గా నటిస్తూ పర్ఫెక్ట్ గా నటించారు. అదేవిధంగా తల్లిగా ప్రమోదిని నటిస్తూ తన పాత్రకు న్యాయం చేశారు. హీరోయిన్ గా మోక్ష తన పరిధిలో తను నటిస్తూ మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. అదేవిధంగా స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ సునీల్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సత్య, పృథ్వి, చిత్రం శ్రీను, హరీష్ మంచి పర్ఫార్మెన్స్ తో చిత్రానికి బోనస్ గా నిలిచారు. అలాగే చిత్రంలో నటించిన ఇతర నటీనటులు అంతా తమ పాత్ర పరిధిలో తాము నటిస్తూ చిత్రానికి ప్లస్గా నిలిచారు.
సాంకేతిక విశ్లేషణ :
తాను దర్శకుడిగా తొలిచిత్రమైనప్పటికీ ధనరాజ్ ఈ సినిమా రావడంలో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. తన తొలి దర్శకత్వం చేస్తున్న సినిమాలోని తాను నటిస్తూ చేయడం అనేది కొంచెం కష్టమైన పని అయినప్పటికీ ధనరాజ్ ఆ విషయంలో విజయం సాధించాలని చెప్పుకోవాలి. కథకు తగ్గట్లు పాత్రలను సెలెక్ట్ చేసుకుని తనదైన శైలిలో దర్శకత్వం చేస్తూ ముందుకు సాగాడు. చిత్రానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మంచి ప్లస్ గా నిలిచింది. అలాగే ఉన్న పాటలు కూడా చిత్రంతో పాటు వెళ్తూ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. సినిమాలో కలరింగ్ ఇంకా ఇతర సాంకేతిక అంశాలలో కూడా తగ్గ జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతుంది. నటీనటులను, చిత్ర సాంకేతిక బృందాన్ని అందరిని దర్శకుడు ఎంతో నైపుణ్యంగా వాడుకున్నట్లు అర్థమవుతుంది. సినిమా కొంచెం స్లో గా ఉంది అనిపించినప్పటికీ ఎమోషన్ బాగా పండడంతో ప్రేక్షకులు ఎక్కడ బోర్ గా ఫీల్ అవ్వరు. ఇంటర్వెల్ సీన్ మంచి ట్విస్ట్ అనిపించింది. అలాగే క్లైమాక్స్ అయితే పూర్తిగా ఎమోషన్స్ ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకునే విధంగా ఉంది. సినిమా అంతా గోదావడి జిల్లాలోని న్యాచురల్ లొకేషన్స్లో తీసినట్లు అర్థమవుతుంది. సినిమా నిదానంగా ఉంది అర్పించినప్పటికీ ఎమోషన్స్ పరంగా ఎంతో బాగా వర్కౌట్ అయింది. మొత్తానికి ఈ చిత్రంతో ధనరాజ్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడని చెప్పుకునే విధంగా చిత్రం రావడం జరిగింది.
ప్లస్ పాయింట్స్ :
కథ, నటీనటుల నటన, లొకేషన్స్, దర్శకత్వం, బిజిఎం.
మైనస్ పాయింట్స్ :
సినిమా స్లోగా ఉంది అనిపించడం.
సారాంశం :
తండ్రి కొడుకుల మధ్య జరిగే ఒక మంచి ఎమోషనల్ డ్రామాగా చెప్పుకోవచ్చు. కుటుంబ సమేతంగా వెళ్లి చూసే విధంగా ఈ చిత్రం ఉంది.