ప్రభాస్ లేటెస్ట్ ఫొటోస్ చూసారా?

మ్యాసీవ్ బ్లాక్‌బస్టర్స్ సలార్, కల్కి 2898 AD తర్వాత రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో ఓ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ కోసం కొలాబరేట్ అయ్యారు. ప్రముఖ పాన్-ఇండియా స్టూడియో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం లార్జర్ దెన్ లైఫ్ ఎలిమెంట్స్ తో విజువల్ వండర్ గా ఉండబోతోంది.

లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండ్ అనుపమ్ ఖేర్ చాలా ముఖ్యమైన పాత్ర కోసం ఎంపికయ్యారు. ఈ వార్తను ఆయన స్వయంగా షేర్ చేశారు. గొప్ప పాత్రలు చేయడంలో పేరుపొందిన అనుపమ్, ఈ సినిమా స్క్రిప్ట్‌ను “అద్భుతం” అని అన్నారు. ప్రభాస్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడానికి ఉత్సాహంగా వున్నారు. దర్శకుడు హను రాఘవపూడి ప్రతిభను కూడా ఆయన ప్రశంసించారు.  

“అనౌన్స్‌మెంట్: #ఇండియన్ సినిమా బాహుబలి ప్రభాస్ తో నా 544వ చిత్రాన్ని ప్రకటించినందుకు ఆనందంగా ఉంది, #ఈ చిత్రానికి అద్భుతమైన ప్రతిభావంతులైన @హను రాఘవపూడి దర్శకత్వంవహిస్తున్నారు. @MythriOfficial  అద్భుతంగా నిర్మిస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్ #సుదీప్చటర్జీ #DoP! कमाल की कहानी है!! और क्या चाहिए लाइफ में दोस्तों! जय हो! 

😍
❤️
🙌

” అని అనుపేమ్ ఖేర్ షేర్ చేశారు

ఈ చిత్రం ప్రభాస్, హను రాఘవపూడి,  మైత్రీ మూవీ మేకర్స్‌ల ఫస్ట్ కొలాబరేషన్.

1940 హిస్టారికల్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో మాతృభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడానికి పోరాటం చేసే ఓ యోధుడి కథగా ఉండబోతోంది.

ఇమాన్వి ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, వెటరన్ యాక్టర్స్ మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలు, ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో హై బడ్జెట్‌తో నిర్మించనున్నారు.

నవీన్ యెర్నేని , వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిమిస్తున్న ప్రాజెక్టు టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సుదీప్ ఛటర్జీ ISC కెమెరామ్యాన్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ విలాస్ జాదవ్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

తారాగణం: ప్రభాస్, ఇమాన్వి, మిథున్ చక్రవర్తి, జయప్రద  

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హను రాఘవపూడి
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
డీవోపీ: సుదీప్ ఛటర్జీ ISC
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ప్రొడక్షన్ డిజైనర్: అనిల్ విలాస్ జాదవ్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
లిరిక్స్: కృష్ణకాంత్
కాస్ట్యూమ్ డిజైనర్లు: శీతల్ ఇక్బాల్ శర్మ, టి విజయ్ భాస్కర్
VFX: RC కమల కన్నన్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో