‘పుష్ప’ చిత్రం కోసం పని చేసిన అందరికి షీల్డులు బహుకరిస్తూ థ్యాంక్స్‌ మీట్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, జీనియస్‌ దర్శకుడు సుకుమార్‌ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ ‘పుష్ప-2’ ది రూల్‌. ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో అన్‌ కాంప్రమైజ్‌డ్‌గా నిర్మించారు నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచస్థాయిలో ఎంతటి గొప్ప విజయం సాధించింతో అందరికి తెలిసిందే. ఇండియన్‌ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప-2’ సరికొత్త రికార్డులు సృష్టించింది. రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా ఈచిత్రం థ్యాంక్స్‌ మీట్‌ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈవేడుకలో చిత్రం యూనిట్‌ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు హీరో అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవి శంకర్‌ చేతుల మీదుగా షీల్డులు బహుకరించారు. ఈ సందర్భంగా

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ” పుష్ప జర్నీలో ఐదు నిమిషాల నుండి ఐదు ఏండ్ల వరకు పనిచేసిన అందరికి నా కృతజ్క్షతలు. పుష్ప పోస్టర్‌లో నా ఫోటో చూసుకున్న ప్రతిసారి… నా మీద ఈ టీమ్ అంతా చూపిన ప్రేమే కనిపించింది.మీరు ఎంతో కష్టపడి అద్బుతమైన సినిమా ఇచ్చారు. నిర్మాతలు రవి, నవీన్‌ గారు లేకుంటే పుష్ప సాధ్యమయ్యేది కాదు. మీరు లేకపోతే ఇలాంటి సినిమా తీసేవాళ్లం కాదు. ఈ ఐదు సంవత్సరాలు ఎంతో బాగా చూసుకున్నారు. సెట్‌లో ఎవరూ లేకున్న చెర్రీ గారు లేకుండా పుష్ప షూటింగ్‌ జరగదు. ప్రతి డిపార్ట్‌మెంట్‌కు నా హృదయపూర్వక కృతజ్క్షతలు. దేవిశ్రీప్రసాద్‌ నా సాంగ్స్‌ను బిలియన్స్‌ల్లో చూపించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ తన అద్భుతమైన సంగీతంతో సినిమాకు ఎనర్జీ ఇచ్చాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆదరించిన పుష్ప అభిమానులకు నా థ్యాంక్స్‌. నేను సుకుమార్‌కు థ్యాంక్స్‌ చెప్పి వదిలేయలేను. ఎందుకంటే అందరికి హిట్‌ ఇచ్చేది దర్శకుడే. ఈ సినిమా విషయంలో అందరూ సుకుమార్‌కు థ్యాంక్స్‌ చెప్పాలి. సుకుమార్‌ మాత్రం ఈ సినిమా విజయంలో అందరికి క్రెడిట్‌ ఇస్తాడు. కానీ అందరికి క్రెడిట్‌ ఇవ్వడానికి కారణం దర్శకుడు సుకుమారే. నా నటనకు ఎంతో మంచి పేరు వచ్చింది. దీనికి కారణం దర్శకుడు సుకుమారే. సుకుమార్‌కు నేను బిగ్గెస్ట్‌ ఫ్యాన్‌ని, ఆయన సీన్‌ చెబుతుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. జీనియస్‌ దర్శకుడు సుకుమార్‌. నేను పుష్ప-2 షూటింగ్‌ అయిపోయన తరువాత ఎంతో ఎమోషనల్ అయ్యాను. పుష్ప అనేది ఓ ఎమోషన్‌. ఈ సినిమా జరుగుతున్నప్పుడు ఐదు సంవత్సరాలు సుకుమార్‌ ఏది చెబితే అది చేశాం. ఈ సినిమాకు వెచ్చించిన ఐదు సంవత్సరాలు అందరికి జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ ఐదేళ్లు ప్రతి ఒక్కరికి ప్రతి సెకనుకు ఎంతో ఉపయోగపడింది. ఈ సినిమా సక్సెస్‌ను నా అభిమానులకు అంకితం చేస్తున్నాం. పుష్ప-3 ఏంటో తెలియదు కాదు కానీ ఓ అద్బుతంలా కనిపిస్తుంది.

దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ ” మైత్రీ మూవీస్‌ చెర్రీ సలహాతోనే పుష్పను రెండు భాగాలుగా చేశాను. ఆయన సలహా ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. నాకు రంగస్థలం నుంచి ఇప్పటి వరకు వరుస హిట్స్‌ రావడానికి మైత్రీ మూవీస్‌ కారణం. ఈ విజయం వాళ్లదే. నాపేరు సుకుమార్‌ కాదు.. సుకుమార్‌ దేవిశ్రీ ప్రసాద్‌. దేవి లేకుండా నేను సినిమా చేయలేను. భవిష్యత్‌లో కూడా చేయలేను. ఇక అల్లు అర్జున్‌ నాకు ఎంతో ఎనర్జీ ఇస్తాడు. ఈ ప్రపంచంలో నన్ను ఓ అద్బుతంలా భావించే వ్యక్తి అల్లు అర్జున్‌. నన్ను నమ్మే వ్యక్తి. నా దగ్గర సరైన కథ లేకుండా బన్నీ ఓకే అన్నాడు. ఈ సక్సెస్‌ క్రెడిట్‌ మొత్తం అల్లు అర్జున్‌దే. నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ పర్‌ఫార్మె చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది అని ప్రతి సన్నివేశం ముందు చెప్పేవాడిని. ఈరోజు ఆయన నటనకు ఎంతో మంది నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇటీవల ఓ పెద్దాయన అల్లు అర్జున్‌ను నటనలో ఎస్వీ రంగారావుతో పోల్చాడు. ఈ సినిమా సక్సెస్‌లో భాగం అయిన అందరికి నా కృతజ్ఞతలు.

నిర్మాత రవిశంకర్‌, మాట్లాడుతూ ”పుష్ప-2 కు పనిచేసిన అందరికి మా థ్యాంక్స్‌. ఒక వండర్‌ఫుల్‌ ఫిల్మ్‌లో భాగమయ్యారు. ఇంత మంచి సినిమాలో పార్ట్‌ అయినందుకు హ్యపీ. ఈ సినిమాకు హీరో, దర్శకుడు ఎంతో కష్టపడ్డారు.ఈ సినిమా కష్టానికి ఎన్నోరెట్టు ప్రతిఫలం లభించింది. దేవి బ్యాక్‌బోన్ ఆఫ్‌ ద ఫిలిం. ఈ సినిమాకు పనిచేసిన అందరికి కృతజ్క్షతలు. అన్నారు. సుకుమార్‌ ఈజీగా వస్తే తీసుకోరు. ఎంతో కష్టపడే దర్శకుడు. సుకుమార్ విజన్‌ నుంచి వచ్చిన సక్సెస్‌ ఇది. సుకుమార్‌ విజన్‌లో ఉన్నది హీరో ఎంతో అద్బుతంగా డెలివరి చేశారు అన్నారు.

నిర్మాత నవీన్‌ మాట్లాడుతూ ” అంచనాలు మంచి కలెక్ట్‌ చేస్తుందని అనుకున్నాం కానీ. ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని ఊహించలేదు.
ఇంత మంచి సినిమా మా బ్యానర్‌కు ఇచ్చినందుకు హీరో, దర్శకుడికి కృతజ్క్షతలు అన్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ ” ఎన్ని మాటలతో వర్ణించిన చెప్పలేం, పుష్ప అనేది ఓ మ్యాజిక్‌. ఈ మ్యాజిక్‌ క్రియేట్‌ చేసిన హీరో, దర్శకుడు, మైత్రీ మూవీ మేకర్స్‌ కృతజ్క్షతలు. కష్టపడితే యూనివర్శ్‌ మనకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తుంది.. దీనికి నిదర్శనం ఈ సక్సెస్‌. అందరి కష్టం, నిజాయితీకి ఈ పెద్ద బ్లాక్‌బస్టర్‌ అనేది నిదర్శనం. ఈ సినిమా అందరూ తమ మాగ్జిమమ్‌ ఎఫర్ట్‌ పెట్టారు. సుకుమార్‌ గారి విజన్‌.. పుష్పను ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు వచ్చింది.ఆయన విజన్‌కు అల్లు అర్జున్‌ ప్రాణం పోశారు’ అన్నారు. ఈ సమావేశంలో మ్రైతీ మూవీ సీఈవో చెర్రీ, పంపిణీదారుడు శశి, హిందీ పంపిణీదారుడు అనిల్‌ తడాని, సునీల్‌, గణేష్‌ ఆచార్య, జగదీష్‌, పావని, మోనిక రామకృష్ణ, ఆదిత్య మీనన్‌, గగన్‌ విహారి, సీవీ రావు అజయ్‌, తారక్‌ పొన్నప్ప, విజయ్‌ పోల్లంకి, ఫైట్‌ మాస్టర్‌ డ్రాగన్‌ ప్రకాష్‌, మహాలింగం, లక్ష్మీకాంత్‌, ముఖేష్‌ మెహతా, తదితరులు పాల్గొన్నారు.