
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో నటుడు శ్రీనివాస రెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం బయట ఆయనతో ఫొటోలు తీసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపించారు.