
ప్రముఖ సినీ డైరెక్టర్ రాఘవేంద్రరావు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.