
ఇటీవల కాలంలో హీరో అక్కినేని అఖిల్ నిశ్చితార్థమైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వివాహం దగ్గర పడుతున్న సందర్భంగా అక్కినేని నాగార్జున స్వగృహంలో అఖిల్ పెళ్లికి సంబంధించి పసుపు కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, దగ్గుబాటి వెంకటేష్ హాజరయ్యారు. అంతేకాక అనకాపల్లి జిల్లా పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అయితే చాలా తక్కువ మంది ప్రముఖులతో ఈ కార్యక్రమాన్ని అక్కినేని నాగార్జున తన ఇంటి వద్ద చేసినట్లు అర్థమవుతుంది. తండాల్ చిత్రం కోసం అక్కినేని ఫ్యాన్స్ కు అఖిల్ పెళ్ళి దగ్గర కావడం వారికి మరొక బోనస్ గా అనిపిస్తుంది.