ఓటిటి రిలీజ్ కు రెడీ అయిన భారీ బడ్జెట్ చిత్రం

తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గేమ్ చేంజర్. పొలిటికల్ యాక్షన్ డ్రామా జోనర్స్ లో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకులను థియేటర్లలో అలరించింది. ఎస్ వి సి ప్రొడక్షన్స్ ద్వారా దిల్రాజు నిర్మాణంలో ఈ చిత్రం విడుదలైంది. అయితే ఫిబ్రవరి 7వ తేదీ నుండి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో స్ట్రీమ్ కానున్నట్లు అమెజాన్ వారు తమ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. థియేటర్లో ఎంతో ప్రజలను పొందినప్పటికీ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఓటిటిలో చూసేందుకు కూడా ఎదురుచూస్తున్నారు. థియేటర్లో మిస్సయిన మెగా ఫ్యాన్స్ కు ఈ వార్త ఫుల్ ఎనర్జీ ఇస్తుంది. ఈ చిత్రంలో ఎస్ జె సూర్య, అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రకు పోషించారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించగా తిరు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.