టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ నటించిన న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ ‘జీబ్రా’ బొమ్మ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్ గా నటించారు. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అన్ని చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
నిర్మాత దినేష్ మాట్లాడుతూ… “సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. క్లాప్ అసిస్టెంట్‌గా నా జీవితం మొదలైంది. తరువాత కెమెరా అసిస్టెంట్‌గా చేశాను. ఈ చిత్రం కోసం దర్శకుడు 5 సంవత్సరాలు పెట్టారు. చిత్రానికి సత్యదేవ్ చాల కష్టపడి పని చేశారు. మేము మరోసారి కలిసి పని చేయాలి అని కోరుకుంటున్నాను. అలాగే చిత్రంలో చేసిన ప్రతి ఒక్కరూ చాల బాగా చేశారు. తొలి నిర్మాతగా గత 3 సంవత్సరాలలో ఈ సినిమా కోసం చాలా కష్టాలు పడ్డాము. ఈ సినిమాను కచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన సినిమా” అన్నారు.
దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ మాట్లాడుతూ… “ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నమస్కారం. ప్రతి దర్శకుడు ఇటువంటి ఒక స్టేజ్ మీద మాట్లాడాలి అని అనుకుంటారు. నేను ఇలా ఉన్నందుకు సంతోష పడుతున్నాను. ఈ సినిమాకు రవి బసురూర్ మంచి సంగీతం అందించారు. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు నా కృజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ సినిమా మనం సాధారణంగా చూసే ఒక బ్యాంక్ లో జరిగే ఒక కొత్త తరం సినిమా. ఈ సినిమాలో హీరో, విలన్ అని కాదు. ప్రతి మనిషిలో ఉండే బ్లాక్ & వైట్ షేడ్స్ చూపిస్తూ ఉంటుంది. మనిషికి ఉండే ఈగో వార్ ని చూపిస్తూ ఈ చిత్రం ప్రేక్షకుల మన్నన పొందింది. సినిమా కోసం మేము ఎంతో కష్టపడి పని చేశాము. కచ్చితంగా అందరూ సినిమాను చూడాలి అని కోరుకుంటున్నాను. అలాగే క్రిటిక్స్ కు చాల థాంక్స్. మీ రివ్యూల వల్ల నేను తప్పిదం చేస్తే అది నేను తిరిగి సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే సినిమాకు ఈ వారం మాత్రమే సమయం ఉంది. చూడని వారు ఉంటే సినిమాను చూడండి. సత్యదేవ్ లాంటి నటుడు తమిళ్ ఇండస్ట్రీలో ఉంటే ఇంకా బాగ ఉపయోగించుకునేవాళ్ళం. అంత మంచి నటుడు సత్యదేవ్. నేను ఈ సినిమా కథ చాల ఎథికల్ & మొరల్ వాల్యూస్ బ్యాలెన్స్ రాసుకోవడం జరిగింది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు” అన్నారు.
హీరో సత్య దేవ్ మాట్లాడుతూ… “నాకు ఈ సినిమాను ఇచ్చినందుకు ఈశ్వర్ కార్తీక్ కు చాల థాంక్స్. తను నన్ను ఎంతగానో ప్రోత్సహించడం జరిగింది. నా పుట్టినరోజుకు మంచి సందేశం గిఫ్ట్ గా ఇచ్చారు. నన్ను ఆ సందేశం ఎంతగానో మార్చింది. Win the crowd, you will win the freedom అనేది బాగ నమ్ముకున్నాను. సినిమా చూస్తుండగా ప్రేక్షకులను గమనిస్తే అంతటా సినిమా ప్రేక్షకులకు చాల బాగ నచ్చింది అని అర్థం అయింది. నేను బ్లఫ్ మాస్టర్ తరువాత పూర్తిగా లేచి నిలబడటానికి 5 సంవత్సరాలు పట్టింది. దర్శకుడు ఈశ్వర్ కష్టపడి తెలుగు నేర్చుకుని సినిమా ఈ చేశారు. కచ్చితంగా ఈశ్వర్ భవిష్యత్ లో పెద్ద హీరోలతో పనిచేస్తారు అనిపిస్తుంది. మరోసారి అందరికీ ధన్యవాదాలు” అన్నారు.