టీవీ ప్రేక్షకులకు, సోషల్‌మీడియా యూజర్స్‌కు పరిచయం అక్కర్లేని లేని నటి జ్యోతి రాయ్. ‘గుప్పెడంత మనస్సు’ సీరియల్‌తో ట్రెడిషనల్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న ఈమె బయట మాత్రం హాట్ డాల్‌గా కుర్రాళ్లను కవ్విస్తుంటుంది. అయితే ఆమె వయసు వికిపీడియా ప్రకారం 38ఏళ్లు. ఆమెను చూసిన వాళ్లు కూడా 35 నుంచి 38 ఉంటుందనే అనుకుంటారు. కానీ తాజాగా ఆమె అభిమానులతో మాట్లాడుతూ తన అసలు వయస్సును ఫ్రూఫ్‌తో సహా చెప్పింది. ఇది తెలుసుకుంటున్న ఫ్యాన్స్షాక్ అయిపోతున్నారు. వివరాళ్లోకి వెళితే…
మొదట ట్రెడిషనల్‌గా: కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుల్‌క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మొదట గుప్పెడంత మనసు సీరియల్లో ట్రెడిషనల్‌గా రిషికి తల్లి పాత్రలో మెప్పించింది. జగతి అనే రోల్లో సంప్రదాయంగా తన నటనతో పాపులారిటినీ బాగా దక్కించుకుంది. ప్రేక్షకులందరూ ఆమె నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఫుల్ కనెక్ట్ అయ్యారు కూడా.
తనకన్నా చిన్నవాడితో హాట్‌టాపిక్‌గా : అయితే జ్యోతి రాయ్ రియల్ లైఫ్‌లో తన భర్తతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యంగ్డైరెక్టర్పూర్వజ్తో ప్రేమాయణం నడిపి పెళ్లి కూడా చేసుకుంది! ఆ సమయంలో వీళ్ల రిలేషన్షిప్కూడా బాగా హాట్‌టాపిక్‌గా మారింది. అందుకు కారణం ఆమె వయసే(వికిపీడియా ప్రకారం 38). తన కన్నా చిన్న వాడైన దర్శకుడితో ప్రేమలో పడి డేటింగ్ చేసిందని తెగ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు.
సోషల్ మీడియాలో హాట్ డాల్‌గా : అలా పెళ్లి టాపిక్‌తో చర్చనీయాంశమైన జ్యోతి రాయ్సోషల్మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. సీరియల్ లో తల్లి పాత్రలో ట్రెడిషనల్‌గా కనిపించినప్పటికీ బయట మాత్రం చాలా చాలా గ్లామరస్‌గా అందాలను వలకబోసింది. హాట్ డాల్‌గా కనిపించి కుర్రాళ్లకు చెమటలు పట్టించేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేసేసింది.
38 కాదు 30యే అంటూ షాక్: అయితే తాజాగా ఆమె అభిమానులతో ముచ్చటిస్తూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అందరూ జ్యోతి రాయి వయసు 35 నుంచి 38 ఏళ్ల మధ్యలో ఉంటుందని అనుకున్నారు. వికిపీడియా కూడా అంతే చూపించింది. కానీ ఆమె మాత్రం తన వయసు 30 అని చెప్పి షాక్ ఇచ్చింది. అంతేకాదు ఆమె తన పాన్ కార్డును చూపిస్తూ అందులోని డేట్ అఫ్ బర్త్ కూడా ప్రూఫ్‌గా చూపించింది.
జ్యోతి రాయ్ 1994లో జూలై 4న జన్మించినట్లు అందులో ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పాన్ కార్డ్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అండ్ సర్ప్రైజ్ అయిపోతున్నారు. అయితే జ్యోతిరాయ్ కు 16ఏళ్ల కొడుకు ఉన్నాడు. మరి ఆమె వయసు 30ఏళ్లు అయితే… 16ఏళ్ల కొడుకు ఎలా సాధ్యం అంటూ నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చిన్నప్పుడే పెళ్లి అయినా.. ఇది సాధ్యం కాదంటూ.. షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.