తమిళనాట భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ జనవరి 26న తెలుగులో విడుదల కానుంది. సత్య జ్యోతి ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో గ్రాండ్ గా విడుదల చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ‘కెప్టెన్ మిల్లర్’ విశేషాలని పంచుకున్నారు.
‘కెప్టెన్ మిల్లర్’ ఆలోచన మీకెప్పుడు వచ్చింది?
– కెప్టెన్ మిల్లర్ గురించిన ఆలోచన 10 సంవత్సరాల క్రితం వచ్చింది. బ్రిటీష్ ఆర్మీలో భారతీయ సైనికుడిపై సినిమా తీయాలనేది ఆ ఆలోచన. స్క్రిప్ట్‌పై పని చేయడం ప్రారంభించాను. అలా కెప్టన్ మిల్లర్ ప్రారంభమైంది.
స్క్రిప్ట్ రాసే ముందు ఆ పాత్రలో ధనుష్‌ని ఊహించుకున్నారా?
– లేదు! స్క్రిప్ట్‌ని పూర్తి చేసిన తర్వాత, కెప్టెన్ మిల్లర్ పాత్రకు న్యాయం చేయడానికి ధనుష్ సరిగ్గా సరిపోతారని భావించాను. అతనిని సంప్రదించాము. ధనుష్ గారికి కథ చాలా నచ్చింది. కెప్టన్ మిల్లర్ గా అద్భుతమైన నటన కనపరిచారు.
ధనుష్‌తో పని చేసిన అనుభవం ఎలా ఉంది?
– ధనుష్ అద్భుతమైన నటుడు, సూపర్ స్టార్. అతను ఎలాంటి పాత్రనైనా చేయగలడు. అతనితో పని చేయడం అద్భుతమైన అనుభవం, ఈ జర్నీలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అతని నుంచి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి.
కెప్టెన్ రఫిక్ పాత్ర కోసం సందీప్ కిషన్‌ని ఎలా ఎంచుకున్నారు?
– సందీప్ కిషన్ నాకు మంచి స్నేహితుడు. ఆయన నాకు 12 ఏళ్లగాగా తెలుసు. అతనితో 2012లో సినిమా చేయాలనుకున్నాను కానీ అది కార్యరూపం దాల్చలేదు. నేను సందీప్‌తో టచ్‌లో వుంటాను. ఈ పాత్రకు తను సరిగ్గా సరిపోతాడని అనుకున్నాను, అతనిని అడిగినప్పుడు అతను వెంటనే అంగీకరించారు. సందీప్ అద్భుతమైన నటుడు.
ఈ ప్రాజెక్ట్ లోకి శివ రాజ్‌కుమార్ గారు ఎలా వచ్చారు?
– మేము మొదట్లో ఒకరిద్దరు తమిళ నటులను అనుకున్నాం. కానీ కుదరలేదు. తర్వాత శివ రాజ్‌కుమార్‌ను సంప్రదించాం. చిత్రంలో ఆయన నటన “ఓం”, ముఖ్యంగా ఉపేంద్ర కొలాబరేషన్ లో చేసిన ఐకానిక్ స్టయిల్ ని గుర్తు చేస్తుంది. ఆయన లుక్ పాత్రకు సరిగ్గా సరిపోయింది. సినిమాలో శివన్న స్క్రీన్ ప్రజెన్స్ అద్బుతంగా వుంటుంది. తన పాత్ర నేపథ్యం ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. శివన్న , ధనుష్‌కి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని కట్టిపడేస్తాయి.
కెప్టెన్ మిల్లర్ కథ ఎలా సాగుతుంది? ఎలాంటి యాక్షన్, డ్రామా వుంటుంది ?
– ఇది చాలా ఎమోషనల్ కథ, చిత్రంలో 40% మాత్రమే యాక్షన్ ఉంది. మిగిలినది పాత్ర యొక్క ప్రయాణం గురించి ప్యూర్ డ్రామా. ప్రేక్షకులు పాత్రలకు, కథకు చాలా బాగా రిలేట్ అవుతారు.
వెల్మతి పాత్రలో ప్రియాంక అరుల్ మోహన్ని ఎలా ఊహించారు?
– ఆమె చాలా ప్రొఫెషనల్ నటి, మొదట్లో రెండు రోజులు ఇలాంటి పాత్రలో చేయడం తనకి కష్టమైనా తర్వాత అలవాటు పడింది. నా చిత్రంలో మహిళా పాత్రలు తమ పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నాను. ప్రియాంక ఇంతకు ముందు ఇలాంటి పాత్రలు చేయలేదు. వెల్మతి పాత్రకు ఆమె పర్ఫెక్ట్.
షూటింగ్లో మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా?
– మేము 114 రోజులు షూట్ చేసాము. చాలా మరపురాని క్షణాలు ఉన్నాయి, ఒకదాన్ని ఎంచుకోవడం కష్టం. ప్రతి రోజు ఒక కొత్త అనుభవం, మరపురాని క్షణం.
ప్రేక్షకులను 1930లలోకి తీసుకెళ్లడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సి ఉంది. సినిమా నిర్మాణం ఎంత సవాలుగా అనిపించింది ?
– ఇది మాకు బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే మేము స్టూడియోలో ఒక్క సన్నివేశాన్ని కూడా చిత్రీకరించలేదు, అంతా లైవ్ లోకేషన్స్ లో షూట్ చేశాం. కాబట్టి, 30, 40ల వాతావరణాన్ని రిక్రియేట్ చేయడం చాలా పెద్ద సవాలు, మా ఆర్ట్ డైరెక్టర్ రామలింగం దానిని అద్భుతంగా తీర్చిదిద్దారు. సినిమాలో తక్కువ CG పార్ట్ ఉంది, మీరు స్క్రీన్‌పై చూసేదంతా రియల్.
ఏషియన్ సినిమాస్ , సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగు విడుదల గురించి?
– వారు తెలుగులో విడుదల చేస్తున్నారని తెలిసినప్పుడు నేను చాలా సంతోషించాను. వారు ఇక్కడ ది బెస్ట్. సినిమాని గొప్పగా విడుదల చేస్తారని నాకు తెలుసు.
కెప్టన్ మిల్లర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఏం చెబుతారు ?
– కెప్టెన్ మిల్లర్ స్వేచ్ఛ, ఆత్మగౌరవం గురించిన కథ. సినిమా ఇతివృత్తం చాలా యూనివర్సల్‌గా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది.