83/TFCC/2023-25 25-08-2023
పత్రికా ప్రకటన
జాతీయ చలన చిత్ర అవార్డు గ్రహీతలకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభినందనలు
69వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను భారత ప్రభుత్వం 24/08/2023 వ తేదీన ప్రకటించినది. ఈ పురస్కారాలలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అత్యధికంగా అవార్డులు సాధించడం ఒక శుభపరిణామం.
బహుళ ప్రజాదారణ పొందిన చిత్రం: ఆర్ ఆర్ ఆర్ (నిర్మాత శ్రీ DVV దానయ్య, దర్శకుడు శ్రీ SS రాజమౌళి), ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం: ఉప్పెన (నిర్మాతలు శ్రీ యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్ మరియు దర్శకుడు సాన బుచ్చి బాబు), జాతీయ ఉత్తమ నటుడు: శ్రీ అల్లు అర్జున్ (పుష్ప), ఉత్తమ సంగీత దర్శకుడు: శ్రీ దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప), ఉత్తమ నేపధ్య సంగీతం: శ్రీ MM కీరవాణి (ఆర్ ఆర్ ఆర్), ఉత్తమ సాహిత్యం: శ్రీ చంద్రబోస్ (కొండపొలం), ఉత్తమ గాయకుడు: శ్రీ కాలభైరవ (కొమరం భీముడొ- ఆర్ ఆర్ ఆర్), ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ: శ్రీ కింగ్ సొలమన్ (ఆర్ ఆర్ ఆర్), ఉత్తమ నృత్య దర్శకుడు: శ్రీ ప్రేమ్ రక్షిత్ (ఆర్ ఆర్ ఆర్), ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: శ్రీ వి. శ్రీనివాస మోహన్ (ఆర్ ఆర్ ఆర్), ఉత్తమ సినీ విమర్శకుడు: శ్రీ పురుషోత్తమాచార్యులు ఈ జాతీయ అవార్డులు పొందిన వారందరికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేయుచున్నది.
పైన అవార్డులు సాధించిన వారి స్పూర్తితో భవిష్యత్ తరాలవారు అన్ని విభాగాలలో మరెన్నో అవార్డులు సాధిస్తారని, సాధించగలరని ఆశిస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ శుభాభివందనాలు తెలియజేస్తూ మీ…
(వి. వెంకట రమణారెడ్డి (దిల్ రాజు)) (కె.ఎల్. దామోదర్ ప్రసాద్)(కె. శివ ప్రసాదరావు)
అధ్యక్షులు గౌరవ కార్యదర్శులు