లవ్, కామెడీ ఎంటర్టైనర్ ‘భారీ తారాగణం’ మూవీ రివ్యూ
నటీ నటులు
సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష, తదితరులు.
సాంకేతిక నిపుణులు: l
రేటింగ్ : 3/5
కెమెరా: ఎం.వి గోపి
ఎడిటర్: మార్తండ్ కె. వెంకటేశ్
సంగీతం: సుక్కు
నేపథ్య సంగీతం: సాహిత్య సాగర్
కో-ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ గౌడ్.వి
కొరియోగ్రాఫర్: శ్రీవీర్ దేవులపల్లి
పాటలు: సుక్కూ, సాహిత్య, కమల్ విహాస్, శేఖర్
పిఆర్వో: మధు వి.ఆర్
ఆర్ట్: జెకె మూర్తి
స్టంట్స్: దేవరాజ్
బ్యానర్: బివిఆర్ పిక్చర్స్
నిర్మాత: బి.వి.రెడ్డి
దర్శకత్వం: శేఖర్ ముత్యాల
బివిఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష నటీ నటులుగా శేఖర్ ముత్యాల దర్శకత్వంలో బి.వి రెడ్డి నిర్మించిన లవ్, కామెడీ ఎంటర్టైనర్ ‘భారీ తారాగణం’. ఈ ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్,ట్రైలర్,పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ప్రేక్షకాదరణ లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 23నగ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.
కథ
ఒక కూతురు , ఒక వైఫ్, ఒక లవర్, ఒక పి. ఎ, ఒక ఫ్రెండ్ లు ఇలా ఐదుగురు అమ్మాయిలు వారి వారి జీవితాలో ఎటువంటి ప్రాబ్లెమ్ ఎదుర్కొన్నారు. ఆ ప్రాబ్లెమ్ నుండి వారు ఎలా బయట పడ్డారు. ఒకరికి హెల్ప్ చేస్తే ఆది ఎలాగైనా తిరిగి,మనదగ్గరకు వస్తుంది అనేదే కథ.
విశ్వనాధ్ (కేదార్ శంకర్), రఘు (తోటమల్లి మధు) మంచి స్నేహితులు అయితే విశ్వనాధ్ కొడుకు సదన్(హీరో), రఘు కూతురు ధనలక్ష్మి,(రేఖ నిరోషా)లు చిన్నప్పటి నుండి ఒకే స్కూల్ లో చదువుతూ ఎంతో ఆప్యాయంగా ఉన్న వీరిద్దరినీ చూసి పెద్దయిన తరువాత వీరిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటారు. అయితే ఉన్నత చదువుల కోసం పట్నం వచ్చి బి.టెక్ లో జాయిన్ అవుతాడు సదన్.అదే కాలేజ్ లో చదువుతూ ఎదుటివారికి సహాయం చేయడంలో ముందున్న తార (దీపిక రెడ్డి) ను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. సదన్ చేసే పనులతో ఆ తార కూడా సదన్ ను ఇష్టపడుతుంది. అయితే తారకు అనుకొని సంఘటనలు ఎదురుకావడంతో సదన్ కు దూరంగా ఉంటుంది. అయితే తన ప్రేమను రిజెక్ట్ చేసినందనే భావనతో అమ్మాయిలు అందరూ అంతే అని తిరిగి తన విలేజ్ బకు వస్తాడు.
అయితే రఘు తన కూతురు ధనలక్ష్మి కి పెళ్లి చేయాలని ఎన్ని సంబందాలు చూసినా రిజెక్ట్ చేస్తుంది.చివరికి చిన్నప్పటి ఫ్రెండ్ సదన్ కూడా పెళ్లి చేసుకోను అంటుంది.
మరో వైపు చిట్టెమ్మ దాభ నడుపుతున్న చిట్టెమ్మ (సరయు) కూడా ఎన్నో ఇబ్బందులు పడుతుంటుంది. ఇలా శాంతి (సాహితీ దాసరి), ధనలక్ష్మి,(రేఖ నిరోషా) పరిమళ (స్మైళీ ) అనే ఐదుగురు అమ్మాయిల వారి వారి జీవితాలలో వేరే వేరే సందర్భాల్లో వారు పడుతున్న ప్రాబ్లెమ్స్ నుండి తెలివిగా ఎలా బయట పడ్డారు? అనుకోని విధంగా హీరో వీరందరికీ ఎలాంటి సహాయం చేశాడు? సదన్ కు ఈ ఐదుగురు అమ్మాయిలతో ఉన్న లింకేమిటి? అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా “భారీ తారాగణం” సినిమా చూడాల్సిందే..
నటీ నటుల పనితీరు
సదన్ పాత్రలో నటించిన అలీ అన్న కొడుకు సదన్ కు ఇది మెదటి చిత్రమైనా తన హావ భావాలతో పాటు, మాటలు, పాటలు, ఫైట్స్, ఏమోషన్స్ ఇలా అన్ని షేడ్స్ లో చాలా చక్కగా నటించి నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు.హీరోయిన్ పాత్రల్లో నటించిన తార (దీపిక రెడ్డి) తన గ్లామర్ తో యూత్ ని ఆకట్టుకోవడమే కాకుండా తనకిచ్చిన పాత్రలో ఒదిగిపోయింది. సెకెండ్ హీరోయిన్ గా నటించిన ధనలక్ష్మి,(రేఖ నిరోషా) కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది..చిట్టెమ్మ పాత్రలో సరయు, డాక్టర్ కు పి. ఎ పాత్రలో నటించిన పరిమళ (స్మైళీ ) లు వారికీచ్చిన పాత్రల మేరకు మెప్పించారు. సైకాలాజీ డాక్టర్ గా శశిధర్ పాత్రలో సమీర్,చిట్టెమ్మ దాభ ఓనర్ గా శ్రీను పాత్రలో ( ఛత్రపతి శేఖర్),హీరో, హీరోయిన్స్ కు తల్లి తండ్రులు పాత్రల్లో విశ్వనాధ్ (కేదార్ శంకర్), రఘు (తోటమల్లి మధు), ఇలా అందరూ కాస్త ఇంపార్టెన్స్ ఉన్న పాత్రనే చేసి మెప్పించారు. హీరో కు ఫ్రెండ్స్ గా నటించిన సన్నీ, సత్య లు తన కామెడీ టైమింగ్ తో చాలా చోట్ల నవ్వించే ప్రయత్నం చేశారు.
ఇందులో ఆలీ ఒక పాటలో నటించడం విశేషం.
పొలిటిసియన్ గా పోసాని పాత్ర చిన్నదే అయినా కథకు చాలా ఇంపార్టెన్స్ ఉంది.ఇలా ఈ సినిమాలో నటించిన వారందరూ కూడా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.
సాంకేతిక నిపుణుల పనితీరు
ఆడవారు వారి వారి జీవితాలో ఎటువంటి ప్రాబ్లెమ్ తో ఇబ్బంది పడుతుంటారు. ఆ ప్రాబ్లెమ్ నుండి వారు ఎలా బయట పడాలి అనే కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని దీనికి
లవ్,కామెడీ మరియు థ్రిల్లర్ ను జోడించి మూవీస్ కు కావాల్సిన డైలాగ్స్ ను కొత్త రకంగా ఉండేలా స్క్రీన్ ప్లేను గ్రిప్పింగ్ గా రాసుకుని ఎన్నో ట్విస్ట్ & టర్న్స్ తో ఆడియన్స్ ని థియేటర్లో కూర్చునేలా బాగా ఎంగేజింగ్ తీశాడు దర్శకుడు శేఖర్ ముత్యాల. తాను రాసుకున్న కథ కథనాలు తెర మీద చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సంగీత దర్శకుడు సుక్కు ప్రేక్షకులను ఆకట్టుకొనే విధమైన వున్నాయి. సాహిత్య సాగర్ చక్కటి నేపధ్య సంగీతం అందించాడు.ప్రేక్షకులను ఆలోచింపజేసే ఏలో ఏలో అనే పాట, .బాపు బొమ్మ గీస్తే అనే పాట తొలి తొలి తమకంలే అనే రొమాన్స్ తో సాగే పాటలు బాగున్నాయి.
సినిమాటోగ్రాఫర్ ఎం.వి గోపి తన కెమెరాతో మంచి విజువల్స్ అందించాడు .దేవరాజ్ అందించిన స్టంట్స్ బాగున్నాయి . మార్తండ్ కె. వెంకటేశ్. ఎడిటింగ్ పనితీరు బాగుంది.బివిఆర్ పిక్చర్స్ పతాకంపైఅన్ని వర్గాల వారికి నచ్చే ఎలిమెంట్స్ తో ఖర్చుకు వెనుకాడకుండా బి.వి.రెడ్డి నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. లవ్ కామెడీ మరియు థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం “భారీ తారాగణం ” చిత్రం కచ్చితంగా నచ్చుతుంది.