దాసరి నారాయణరావు

Dr. Dasari Narayan Rao in his office after taking over the charge as the Minister of State for Coal & Mines in New Delhi on May 24, 2004 (Monday).

దాసరి నారాయణరావు ( మే 4, 1947 – మే 30, 2017) ఆంధ్రప్రదేశ్కు చెందిన సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత , రాజకీయనాయకుడు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు.ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం , కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది.
దాసరి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, , మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి తిసిన బొబ్బిలి పులి , సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి.
మామగారు, సూరిగాడు , ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు , బహుమతులు అందుకున్నాడు.

బాల్యంసవరించు
1947, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించాడు. దాసరిది పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబం. ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి. దాసరి నాన్నా పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్‌ తగలబడిపోయింది. అప్పట్లో ఇన్సూరెన్సులు ఉండేవి కాదు. దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సివచ్చింది. వారు మొత్తం ఆరుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ఆడపిల్లలు. దాసరి మూడో వాడు.
వారి నాన్న తరం వరకూ వారి కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు. దాసరి వాళ్ళను మాత్రం చదివించారు వాళ్ళ నాన్న. దాసరి ఆరో తరగతి కొచ్చేసరికి వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. స్కూలు ఫీజు మూడుంపావలా కట్టడానికి కూడా డబ్బులేక ఆయన్ను బడి మాన్పించి ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టారు. అక్కడ జీతం నెలకి రూపాయి.
ఆరో తరగతిలో ఉత్తమవిద్యార్థిగా ఆయనకు బహుమతి వచ్చింది. అలాంటిది చదువు మానేసి పనిలోకెళ్లాల్సిన దుస్థితి. కానీ ఒక మాస్టారు సాయంతో మళ్ళీ చదువు కొనసాగించాడు.

రాజీవ్ గాంధీ పాలనాకాలములో, దాసరి కాంగ్రేసు పార్టీ తరఫున ఉత్సాహవంతముగా ఎన్నికల ప్రచారము సాగించాడు. రాజీవ్ హత్యానంతరం పార్టీకి కాస్త దూరంగా జరిగారు. 1990 దశకం చివరిలో ఆయన తెలుగు తల్లి అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాడు. ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని కాపు వర్గాల నుండి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత మాత్రం ఆయన కాంగ్రేస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నిక అయ్యాడు. బొగ్గు , గనుల శాఖకు కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించాడు. ఈయన కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సన్నిహితుడు. కాంగ్రేస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు.

మరణంసవరించు
దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికిందరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో 2017 మే 30న మరణించాడు.[3]

అవార్డులుసవరించు

1974లో తాతా మనవడు సినిమాకి నంది అవార్డు అందుకున్నాడు.

స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది బహుమతిని పొందాడు.

1983లో మేఘ సందేశం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందాడు.

1992లో మామగారు చిత్రానికి గాను ఉత్తమ నటుడు నంది అవార్డును పొందాడు.

1986లో తెలుగు సంస్కృతి , తెలుగు చిత్ర రంగం నకు ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ను పొందాడు.

ప్రముఖ సామాజిక సేవా సంస్థల నుండి అనేక అవార్డ్ లను పొందాడు. వాటిలో కొన్ని వంశీ బెర్క్లే, కళా సాగర్, శిరోమణి ఇన్స్టిట్యుట్ మొదలైనవి. ఫిల్మ్ ఫేర్ అవార్డును 6 సార్లు, మద్రాసు ఫిల్మ్ ఫాన్స్ అవార్డ్ ను 5 సార్లు, సినీ హెరాల్డ్ అవార్డ్ ను 10 సంవత్సరాలు వరసగాను గెల్చుకున్నాడు.

జ్యోతిచిత్ర నుండి సూపర్ డైరెక్టర్ అవార్డ్ ను 3 సార్లు పొందాడు.

పాత కాలం నాటి ఆంధ్రపత్రిక నుండి ఉత్తమ దర్శకుడిగా 6 సార్లు ఎంపిక అయ్యాడు.

ఇవి కాక ఆయన నిర్మించిన చిత్రాలలో అనేకం అవార్డ్ లను గెలుచుకున్నాయి.

1970 దశాబ్దంసవరించు

తాత మనవడు (1972) (మొదటి సినిమా)

సంసారం సాగరం (1973)

బంట్రోతు భార్య (1974)

ఎవరికి వారే యమునా తీరే (1974)

రాధమ్మ పెళ్ళి (1974)

తిరుపతి (1974)

స్వర్గం నరకం (1975)

బలిపీఠం (1975)

భారతంలో ఒక అమ్మాయి (1975)

దేవుడే దిగివస్తే (1975)

మనుషులంతా ఒక్కటే (1976)

ముద్దబంతి పువ్వు (1976)

ఓ మనిషి తిరిగి చూడు (1976)

పాడవోయి భారతీయుడా (1976)

తూర్పు పడమర (1976)

యవ్వనం కాటేసింది (1976)

బంగారక్క (1977)

చిల్లరకొట్టు చిట్టెమ్మ (1977)

ఇదెక్కడి న్యాయం (1977)

జీవితమే ఒక నాటకం (1977)

కన్యాకుమారి (1978)

దేవదాసు మళ్ళీ పుట్టాడు (1978)

కటకటాల రుద్రయ్య (1978)

శివరంజని (1978)

స్వర్గ్ కరక్ (హిందీ, 1978) (Story, Screenplay and Director)

గోరింటాకు (1979)

కళ్యాణి (1979)

కోరికలే గుర్రాలైతే (1979)

నీడ (1979)

పెద్దిల్లు చిన్నిల్లు (1979) (actor and director)

రాముడే రావణుడైతే (1979)

రంగూన్ రౌడీ (1979)

ఊఫ్ఫేణా (1980)

1980 దశాబ్దంసవరించు

జ్యోతి బనే జ్వాల (హిందీ, 1980)

బండోడు గుండమ్మ (1980)

భోళా శంకరుడు (1980)

బుచ్చిబాబు (1980)

సర్కస్ రాముడు (1980)

దీపారాధన (1980)

ఏడంతస్తుల మేడ (1980)

కేటుగాడు (1980)

Natchatiram (1980)

పాలు నీళ్ళు (1980)

సర్దార్ పాపారాయుడు (1980)

సీతారాములు (1980)

శ్రీవారి ముచ్చట్లు (1980)

స్వప్న (1980) (Director)

యే కైసా ఇన్సాఫ్ (1980)

ప్యాసా సావన్ (1981) (Director)

అద్దాల మేడ (1981)

ప్రేమాభిషేకం (1981)

ప్రేమ మందిరం (1981)

ప్రేమ సింహాసనం (1981)

బొబ్బిలి పులి (1982) (Story, Dialogues, Screenplay and Director)

గోల్కొండ అబ్బులు (1982)

జగన్నాథ రథచక్రాలు (1982)

జయసుధ (1982)

కృష్ణార్జునులు (1982)

మెహిందీ రంగ్ లాయేగీ (హిందీ, 1982)

ఓ ఆడది ఓ మగాడు (1982)

రాగదీపం (1982)

స్వయంవరం (1982)

యువరాజు (1982)

ప్రేమ్ తపస్య (హిందీ, 1983)

బహుదూరపు బాటసారి (1983)

మేఘసందేశం (1983)

ఎం. ఎల్. ఏ. ఏడుకొండలు (1983)

పోలీస్ వెంకటస్వామి (1983)

రాముడు కాదు కృష్ణుడు (1983)

రుద్రకాళి (1983)

ఊరంతా సంక్రాంతి (1983)

యాద్గార్ (హిందీ, 1984)

ఆశాజ్యోతి (1984)

Aaj Ka శాసన సభ్యులు. Ram Avtar (1984)

అభిమన్యుడు (1984)

హైసియత్ (హిందీ, 1984)

జగన్ (1984)

జస్టిస్ చక్రవర్తి (1984)

పోలీస్ పాపన్న (1984)

యుద్ధం (1984)[4]

జఖ్మి షేర్ (హిందీ, 1984)

వఫాదార్ (హిందీ, 1985) (Director)

బ్రహ్మముడి (1985)

ఏడడుగుల బంధం (1985)

లంచావతారం (1985)

పెళ్ళి మీకు అక్షింతలు నాకు (1985)

తిరుగుబాటు (1985)

ఆది దంపతులు (1986)

ధర్మపీఠం దద్దరిల్లింది (1986)

తాండ్ర పాపారాయుడు (1986)

ఉగ్ర నరసింహం (1986)

ఆత్మ బంధువు (1987)

బ్రహ్మ నాయుడు (1987)

మజ్ను (1987)

నేనే రాజు – నేనే మంత్రి (1987)

హిట్లర్ (1997) (Actor)

విశ్వనాథ నాయకుడు (1987)

బ్రహ్మ పుత్రుడు (1988)

ఇంటింటి భాగోతం (1988)

కాంచన సీత (1988)

ప్రజా ప్రతినిధి (1988)

లంకేశ్వరుడు (1989) (Writer and Director)

బ్లాక్ టైగర్ (1989)

మాత్ కీ లడాయి (హిందీ, 1989)

నా మొగుడు నాకే సొంతం (1989)

టూ టౌన్ రౌడీ (1989)

1990 దశాబ్దంసవరించు

అహంకారి (సినిమా)

మామా-అల్లుడు (1990)

అమ్మ రాజీనామా (1991) (actor and director)

నియంత (1991)

రాముడు కాదు రాక్షసుడు (1991)

అహంకారి (1992)

సూరిగాడు (1992)

సుబ్బారాయుడి పెళ్ళి (1992)

మామగారు (1991)

వెంకన్నబాబు (1992)

సంతాన్ (1993)

అక్క పెత్తనం చెల్లెలి కాపురం (1993)

కుంతీ పుత్రుడు (1993)

మామా కోడలు (1993)

బంగారు కుటుంబం (1994)

నాన్నగారు (1994)

కొండపల్లి రత్తయ్య (1995)

మాయా బజార్ (1995)

ఒరే రిక్షా (1995)

విశ్వామిత్ర (1995)

కళ్యాణ ప్రాప్తిరస్తు (1996)

ఒసే రాములమ్మ (1997)

గ్రీకువీరుడు (1998)

2000 దశాబ్దంసవరించు

అడవి చుక్క (2000)

కంటే కూతుర్నే కను (2000) (story, dialogues, lyrics, screenplay and direction)

సమ్మక్క సారక్క (2000)

చిన్నా (2001)

కొండవీటి సింహాసనం (2002) (Producer and Director)

రైఫిల్స్ (2002)

ఫూల్స్ (2003)

మైసమ్మ IPS (2007) (Story Writer)

ఆదివారం ఆడవాళ్లకు సెలవు (2007)

మేస్త్రీ 2009

యంగ్ ఇండియా 2010

పరమ వీరచక్ర 2011