ఆలోచనతోపాటు కాసింత ఆవేశం కూడా కావాలి. అప్పుడే ఆట మజాగా ఉంటుంది. ఆటలో నటరాజ్ది ఆలోచనతో పాటు ఆవేశం కూడా ఉండడం వల్లే మిగిలిన ఆటగాళ్లలా కాకుండా, స్ట్రైట్‌గా నిజాయితీ అనే పాయింట్ పట్టుకుని ఆడుతున్నాడు. కోపం వస్తే కోపం, స్నేహం అనిపిస్తే స్నేహం చూపిస్తున్నాడు కాబట్టి ఈ బిగ్‌బాస్ అవ్వగానే సినిమాలో నటించటానికి అతనికి అవకాశాలు ఏర్పడ్డాయి అని వినికిడి. త్వరలో ఒక మంచి సినిమాలో లీడ్ క్యారెక్టర్లో నటించబోతున్నాడని న్యూస్ వచ్చింది.
పీకే స్టైల్‌ని కొంత కలుపుకుంటూ మాస్ తరహాలో మాటలు విసురుతూ స్నేహం కోసం దేన్నైనా త్యాగం చేస్తూ ఈ బిగ్‌బాస్ ఆటలో నటరాజ్ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ నటరాజ్ లేకపోతే ఆ అటలో మసాలా తగ్గుతుందేమోనని అనిపిస్తుంది. అషూ రెడ్డి కూడా నిజాయితీగా ఆడుతున్నా ఈసారి ఆమెను కూడా గట్టిగానే టార్గెట్ చేశారని తెలుస్తోంది.
అందంగా ఉండే అఖిల్ ఆలోచిస్తూ గడపకుండా సమయం వచ్చినప్పుడు తనపై కౌంటర్ వేయాలని చూసిన బిందుపై తనలో కనిపించని ఒక కొత్త షేడ్‌ని చూపించాడు. పీఆర్ టీంని అడ్డం పెట్టుకుని బయట బోల్డంత న్యూస్ రచ్చతో చెలరేగుతున్న బిందుకి కౌంటర్ ఇచ్చాడు.
ఒకప్పటి లీడిరగ్ హీరోయిన్ ఇప్పటి బిగ్‌బాస్ కంటెస్టెంట్ బిందుకు ఎందుకో అప్పుడప్పుడు ఎవరైనా ఇద్దరు గొడవపడుతుంటే వాళ్లని నవ్వుతూ ఆ పెద్ద పెద్ద కళ్లతో ఆనందిస్తూ చూడడం తగ్గిస్తే కాస్త బాగుంటుంది. లేదంటే జనాలు ఆమెని వేరేలా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది.
ఏది ఏమైనా ఈ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడానికి పీఆర్ టీంలని వేలమంది మనుషుల్ని పెట్టి లక్షలు తగలేసి డమ్మీ ఓట్లు వేయించుకుంటూ ఆటకి సంబంధం లేకుండా ఓట్లు దక్కించుకుంటున్నారని అందులో బిందు మాధవి ముందందని వినికిడి.