ప్రొడ్యూసర్ మోహన్ వడ్లపట్ల గారు మాట్లాడుతూ : ఈ సినిమా గురించి మా ఫ్రెండ్ వరంగల్ నుంచి ఫోన్ చేసి, ఊరికి ఉత్తరాన అనే సినిమా మన వరంగల్ కుర్రాడు చేశాడు, ఒకసారి చూడండి అని చెప్పాడు, సరే అనేసి పోస్టర్ ను చూడగానే, హీరోయిన్ చక్కగా నమస్కారం పెడుతూ.. అలాగే ప్రక్కన హీరోని చూడగానే బాగా కనెక్ట్ అయి క్రింద చూస్తే “భీమ్స్” (మ్యూజిక్ డైరెక్టర్) పేరు కనిపించింది, అతను ఒకప్పుడు నా శిష్యుడు పదిహేనేళ్ల క్రితం నా దగ్గర ఉండేవాడు, అప్పుడు నేను ఇంకా ప్రొడ్యూసర్ కాలేదు, ఆ తర్వాత నేను ప్రొడ్యూసర్ అయ్యి సినిమాలు తీసాను, ఇప్పుడు నిర్మాతల మండలికి ప్రధాన కార్యదర్శిగా పిలుస్తున్నారు కానీ ” ఒకప్పుడు ” మెంటల్ కృష్ణ ” ప్రొడ్యూసర్ “మోహన్ వడ్లపట్ల” అని అనేవారు. అలాగే నేను చదువుకున్నది కూడా ” పరకాలలోనే.. వరంగల్ జిల్లా ” మానుకోటలో & ఇల్లందులో చదువుకున్నాను, నర్సంపేటలో 40 సంవత్సరాల క్రితం వీళ్ళ ఊరు ప్రక్కనే మా నాన్నగారు పోలీస్ డిపార్మెంట్ లో C.I.గా పనిచేశారు.
ఈ రోజు ఊరికి ఉత్తరాన సినిమా ప్రెస్ మీట్ అని నా స్టాఫ్ వచ్చి చెప్పగానే భీమ్స్ (కెమెరా మెన్) అలాగే ఆ ప్రొడ్యూసర్ ని నేనే పిలిపించుకొని మాట్లాడాను, వారితో సినిమా కష్టాల గురించి చర్చించాను, ఇక రిలీజ్ కు ముందు కూడా కష్టాలు పడతారని చెప్పాను, ట్రైలర్ చూశాను ఛాలా బాగుంది, సినిమా కూడా చాలా బాగా వచ్చిందని ఆశిస్తున్నాను. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీకి క్రొత్త ప్రొడ్యూసర్స్ వచ్చి నాలుగు సినిమాలు చేస్తే ఇండస్ట్రీ కూడ బాగుంటుంది, వీళ్ళు భవిషత్తులో మరెన్నో సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ గా నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. రిలీజ్ డేట్ కూడా ఖరారు చేసారు, మంచిగానే థియేటర్స్ దొరికినట్టు ఉన్నాయి.ఇది కాకుండా వీళ్ళ చిత్ర బృందం అందరికి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, కెమెరామెన్ మరియు హీరోయిన్ కు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.