తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో సభ్యులుగా ఉన్న తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్లు తమ మెంబెర్స్ కు సొంత రెసిడెన్షియల్ ఫ్లాట్లు కలిగి ఉండాలి అని భావించి – తద్వారా మూవీటవర్స్ పేరుతో మే 2003 లో ఒక సొసైటీని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్గా ఏర్పాటు చేసారు. అయితే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోపరేటివ్ హౌసింగు సొసైటీ , బైలా( BYLAW ) ప్రకారం తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిలు మెంబర్లు మరియు కౌన్సిలు ధ్రువీకరించిన తెలుగు ఫిల్మ్ పరిశ్రమ మెంబర్లకు మాత్రమే మెంబర్షిప్ ఇవ్వాలి . కానీ పైన ఉదహరించిన సొసైటీ బైలాను ఉల్లంఘిస్తూ బయట వ్యక్తులకు మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది .ఈ విషయమై ప్రొడ్యూసర్స్ కౌన్సిలు 18 -09 -2021 న లెటర్ ద్వారా కోపరేటివ్ హౌసింగు సొసైటీ కమీషనరుకు (తెలంగాణ రాష్ట్రం) అబ్జక్షన్స్ తెలియజేస్తూ దీనిపై తక్షణం తగు చర్య తీసుకోవాలని కోరడం జరిగింది . పైన ఉదహరించిన సొసైటీ ఈ విషయమై bylaw amendment ను ”ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్న సంస్థలకు , మరియు వ్యక్తులకు మెంబర్షిప్ ఇవ్వడం” 03 -10 -2021 న జరగబోయే వారి సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ లో ఆమోదం కొరకు ప్రవేశ పెట్టడం పై ”తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిలు” ఇది సిద్ధాంతాలకు విరుద్ధం కాబట్టి అబ్జక్షన్స్ తెలియజేయడం జరిగింది .
తదుపరి ఈ విషయమై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిలు హై కోర్ట్ లో కేసు వేయడం జరిగింది (రిట్ . పిటీషన్ . నం. 24548 / 2021 ది. 01.10 .2021 ). గౌరవ హై కోర్టు దీనిని పరిశీలించి కోపరేటివ్ సొసైటీ కమీషనరుకు ప్రొడ్యూసర్స్ కౌన్సిలు 18 -09 -2021 న పంపిన లెటర్లో విషయాలు పరిశీలించి చర్య తీసుకోవాలి అని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది .