Bollywood: బాలీవుడ్ లెజండరీ అమితాబ్ బచ్చన్ తాజాగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాను కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆ ట్వీట్లో పేర్కొన్నాడు.
కాగా ఇప్పటికే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ , పరేశ్ రావెల్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇదిలా ఉంచితే గతంలో అమితాబ్ బచ్చన్, తన కుమారుడు అభిషేక్ కరోనా బారిన పడి.. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందిన కోలుకున్న విషయం తెలిసిందే..