America: రాంచ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా న్యూయార్క్‌లో ఏం చేశారో తెలుసా..

America: నేడు మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా అమెరికాలోని న్యూయార్క్‌లో టౌన్ స్క్వేర్ వ‌ద్ద రామ్‌చ‌ర‌ణ్ క‌టౌట్‌తో బ‌ర్త్‌డే గ్రీటింగ్స్ వెలువ‌డ్డాయి.. ఈ విష‌యం తెలుసుకున్న ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. టైమ్ స్క్వేర్‌కు అంత‌ర్జాతీయ ప్రాముఖ్య‌త ఉంది.. అమెరికా స్టాక్ మార్కెట్ నాస్డాక్ భ‌వంతి అక్క‌డ‌నే ఉంది.. ఈ భ‌వంతి వ‌ద్ద ఏర్పాటు చేసిన బిల్ బోర్డుపై మొట్ట‌మొద‌టి సౌతిండియా స్టార్ హీరో రాంచ‌ర‌ణ్ ఫోటోలు ప్ర‌ద‌ర్శించ‌డం విశేషం అని చెప్పాలి.

America

ఈ అత్యున్న‌త గౌర‌వానికి మెగా ఫ్యాన్స్ ఎంతో ఉప్పొంగి పోతున్నారు. ఇక ఆయ‌న న‌టించిన ఆర్ఆర్ఆర్, ఆచార్య చిత్రం నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు సోష‌ల్ మీడియాలో రికార్డు సృష్టిస్తుంది.. ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉంది.. అల్లూరి సీతారామ‌రాజుగా రాంచ‌ర‌ణ్ ఎంతో అలరిస్తున్నాడు.. అదేవిధంగా ఆచార్య చిత్రంలో చిరుతో చెర్రీ ఉన్న పోస్ట‌ర్ ప్రేక్ష‌కాభిమానుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంటుంది.