Powerstar: పవర్‌స్టార్ పవన్‌కళ్యాన్, ప్రముఖ దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో హరిహర వీరమల్లు చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎ.ఏమ్. రత్నం నిర్మిస్తుండగా, నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మహిళా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. అభిమానులను విశేషంగా ఆకట్టుంది. ఇందులో Powerstar పవన్ వేసిన కాస్ట్యూమ్స్ ఎంతో ఫిదా చేశాయి.. అయితే ఈ నేపథ్యంలో Powerstar పవన్ కాస్ట్యూమ్స్‌పై స్టైలిష్ట్ ఐశ్వర్య రాజేశ్ పోస్ట్ చేశారు.
ఈ చిత్రంలో పవన్ 30 కాస్ట్యూమ్స్ వేసుకోనున్నాడట.. అలాగే పవన్ మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నాడని ఐశ్వర్య తెలిపింది. అయితే పవన్ కళ్యాణ్ రెండు ట్రయల్స్ చేయగానే కాస్ట్యూమ్స్ అన్నింటికీ ఒకే చెప్పడం థ్రిల్ అయ్యామని, పవన్ కళ్యాణ్ పెట్టుకునే బ్రాస్లెట్, ఇతర ఆభరణాలు, వస్త్రాలను ఐశ్వర్య అండ్ టీం తయారు చేసింది. 17శతాబ్ధం నాటి మొఘల్, కుతుబ్ షాహి కాలం నాటి బ్యాక్ డ్రాప్ పవన్‌కళ్యాన్ అవుట్ ఫిట్స్, రంగులు, ఉపకరణాలు, ఇతర నటీనటులు వేసుకునే కాస్ట్యూమ్స్ రూపకల్పన కోసం ఇండియాలోని పలు ప్రాంతాలను సందర్శించి.. 1000 థాన్లు ఫ్యాబ్రిక్ కొనుగోలు చేసినట్టు ఐశ్వర్య తెలిపింది. ఇక ఈ చిత్రాన్ని సుమారు 150కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారట.. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణీ స్వరాలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.