Bollywood: బిగ్‌బి అమితాబ్‌కు కంటి చికిత్స‌.. ఫ్యాన్స్ ఆందోళ‌న‌!

Bollywood: బాలీవుడ్ లెజండ‌రీ న‌టుడు బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ ఇటీవ‌లే త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా శ‌స్త్ర చికిత్స చేసుకుంటున్న‌ట్లు తెలిపిన విష‌యం తెలిసిందే. కానీ దీనికి సంబంధించిన విష‌యాల‌ను మాత్రం తెలుప‌లేదు.. దీంతో అభిమానుల్లో ఎంతో ఆందోళ‌న క‌లిగించింది. ఆయ‌న‌కు ఏమైంది.. ఆరోగ్యం ఎలా ఉంది.. ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. కాగా ఈ విష‌యంపై తాజాగా పూర్తిగా క్లారిటీ ఇచ్చాడు Bollywoodబిగ్‌బి. సోమ‌వారం నాడు త‌న శ‌స్త్ర చికిత్స వివారాల‌ను తెలిపాడు బిగ్‌బి. కంటి ఆప‌రేష‌న్ చేయించుకున్నానంటూ ఆయ‌న త‌న బ్లాగ్‌లో వెల్ల‌డించాడు. త‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ఆందోళ‌న చెందుతూ.. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించిన అభిమానులంద‌రికీ ఆయ‌న కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

Amithabbachan

అలాగే ఈ వ‌య‌స్సులో కంటి శ‌స్త్రచికిత్స అనేది చాలా సున్నిత‌మైంది. చాలా జాగ్ర‌త్త‌గా చేయాల్సి ఉంటుంది. ఎంతో మంచి చికిత్స అందించారు. క్ర‌మ‌క్ర‌మంగా దృష్టి మెర‌గ‌వుతుంది. అందువ‌ల్ల నేను రాసే వాటిలో త‌ప్పిదాలు చేస్తే మ‌రోలా భావించ‌వ‌ద్దు అని Bollywoodబిగ్‌బి త‌న బ్లాగ్‌లో వివ‌రించారు. అలాగే మ‌రో కంటికి కూడా చికిత్స చేయించుకోవాల్సింద‌ని కూడా ఆయ‌న తెలిపారు. అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రాలు.. వికాస్‌బ‌ల్ సినిమాలో న‌టించాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. అలాగే బిగ్‌బి, అజ‌య్‌దేవ్‌గ‌ణ్ కాంబో మూవీ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ Bollywoodచిత్రానికి అజ‌య్‌దేవ్‌గ‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. అలాగే తెలుగులో ప్ర‌భాస్‌, నాగ్అశ్విన్ కాంబో మూవీలో ఓ కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు బిగ్‌బి.